క్రీడాభూమి

కెప్టెన్‌గా నిరూపించుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువాహటి, మార్చి 3: గువాహటిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న టీ-20 సిరీస్‌లో విజయం ద్వారా వచ్చే ఏడాది టీ-20 వరల్డ్ కప్‌లో ఇదే కోర్ గ్రూప్‌తో పోటీపడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు యోచిస్తోంది. గాయపడిన హర్మన్‌ప్రీత్ కౌర్ కోలుకునేందుకు చాలా సమయం పట్టనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో కెప్టెన్సీగా బాధ్యతలు స్వీకరించనున్న ఐసీసీ వరల్డ్ నెంబర్ ర్యాంకర్ స్మృతి మంధాన తానేంటో ఈ టీ-20 సిరీస్ ద్వారా నిరూపించుకుంటాననే ధీమాను వ్యక్తం చేసింది.
50 ఓవర్ల ఫార్మాట్లలో భారత జట్టు చక్కగా రాణిస్తున్నా, న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన టీ-20 సిరీస్‌ను 0-3తో చేజార్చుకుంది. అయినా, అదే జట్టుతో జరిగిన వనే్డ ఇంటర్నేషన్ మ్యాచ్‌లలో ఘన విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించిన భారత జట్టు ఇపుడు గువాహటిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న టీ-20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై పైచేయి సాధించేందుకు తహతహలాడుతోంది. ముంబయిలో ఇంతకుముందు ఇదే జట్టుతో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో 2-1 తేడాతో విజయం సాధించిన భారత్ ఇపుడు తాజాగా జరిగే టీ-20 సిరీస్‌లోనూ ఇదే ఆటతీరును కనబరచడం ద్వారా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే టీ-20 వరల్డ్ కప్‌లోనూ అద్భుతంగా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్న స్మృతి మంధాన, గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో సైతం రాణించింది. ఇపుడు కెప్టెన్‌గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తనకు వచ్చిన ఈ అపార అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. భారత జట్టులోని సీనియర్ క్రీడాకారిణి, వనే్డ ఇంటర్నేషనల్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం ఇంగ్లాండ్‌తో జరిగే టీ-20 సిరీస్‌లో సమర్థవంతమైన పాత్రను పోషించనుంది.
న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో ఆడలేకపోయిన మిథాలీ అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇక మరో క్రికెటర్ వేదా కృష్ణమూర్తి కూడా టీ-20 సిరీస్‌లో బాగా రాణించగలదనే నమ్మకాన్ని జట్టు యాజమాన్యం విశ్వసిస్తోంది. ఐదుగురు సమర్థులైన బౌలర్లతోపాటు పేస్ విభాగంలో శిఖా పాండే జట్టును ఆదుకోగలదని కెప్టెన్ నమ్ముతోంది.