క్రీడాభూమి

పిసిబికి లాభాల పంట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 12: ఆటగాళ్ల భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని జింబాబ్వే మినహా టెస్టు హోదాగల ఏ ఒక్క జట్టూ తమ దేశంలో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కుదేలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆర్థికంగా నష్టపోయింది. దివాలా పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అయితే, పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)తో తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని పిసిబి అధికారులు అంటున్నారు. తాజా పిఎస్‌ఎల్ ద్వారా 2.6 మిలియన్ డాలర్లు (సుమారు 16.9 కోట్ల రూపాయలు) లాభం వచ్చిందని పిసిబి ప్రకటించింది. టి-20 ఫార్మెట్‌లో గత ఏడాది ఈ టోర్నీని ప్రవేశపెట్టగా, మొదటి ఏడాది భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే, ఈసారి నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టిందని పిసిబి తెలిపింది. ఈటోర్నీతో లాభాల పంట పండిస్తామని ధీమా వ్యక్తం చేసింది. టెలివిజన్ హక్కులు, గేమ్ మనీ రూపంలోనే 8 మిలియన్ డాలర్ల ఆదాయం లభించిందని వివరించింది.
.