క్రీడాభూమి

వరల్డ్ కప్‌లో గెలుపే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువాహటి: మహిళా క్రికెటర్‌గా ఇప్పటికే ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచిన ఘనత సాధించిన తనకు ఆ రికార్డు చిన్నదే అని, వరల్డ్ కప్‌లో గెలుపే తన తదుపరి కర్తవ్యమని, అందులో విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో గత నెల ప్రకటించిన మహిళల ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి ఇంగ్లాండ్‌తో గువాహటిలో మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడే భారత మహిళా జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహించనుంది. గాయపడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానే స్మృతి మంధాన ఇంగ్లాండ్‌తో తలపడే టీ-20 సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనుంది. బ్యాటింగ్‌లో ఇప్పటికే ప్రపంచంలో అగ్రస్థానాన్ని చేరుకున్న తాను ప్రపంచ కప్ టైటిల్ సాధించే దిశగా పోరాడతానని దీమా వ్యక్తం చేసింది. ‘క్రికెట్ క్రీడా జీవితాన్ని ప్రారంభించినపుడు ఎవరైనా ఎప్పటికైనా వరల్డ్ కప్‌లో గెలవాలని ఆశపడతాం. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఐసీసీ వరల్డ్ నెంబర్ వన్‌గా నిలవాలని ఉంటుంది. ఈ రికార్డును ఇటీవలే చేజిక్కించుకున్నాను. ఇపుడు నా తదుపరి లక్ష్యం, కర్తవ్యం, ధ్యేయం అంతా వరల్డ్ కప్‌పైనే’ అని స్మృతి మంధాన పేర్కొంది. గువాహటిలో జరిగే టీ-20 సిరీస్‌ను చేజిక్కించుకోవడం వల్ల వచ్చే ఏడాది జరిగే టీ-20 వరల్డ్ కప్‌లో ఇదే కోర్ గ్రూప్‌తో ఉత్సాహంగా ముందుకు సాగేందుకు మేలు జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని ఆమె అభిప్రాయపడింది. ‘ఇంగ్లాండ్‌తో సోమవారం నుంచి ప్రారంభమయ్యే టీ-20 సిరీస్‌ను తప్పనిసరిగా గెలుస్తాం. ప్రత్యర్థి జట్టు ఎలాంటిదైనా సిరీస్‌లో గెలుపే ధ్యేయంగా పోరాడతాం’ అని కెప్టెన్ పేర్కొంది. ఐసీసీ మహిళల టీ-20 వరల్డ్ కప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో జరుగనుంది. వరల్డ్ కప్‌లో పోటీ పడేందుకు ఇప్పటికే తమ సన్నాహాలను ప్రారంభించామని, రానున్న 6-8 నెలల్లో క్రికెట్‌లోని అన్ని విభాగాల్లో రాటుదేలేందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతామని తెలిపింది. వరల్డ్ కప్‌లో చక్కని ఆటతీరును కనబరిచేందుకు వీలుగా తమ జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో ఇప్పటికే పలు అంశాలపై చర్చించామని, న్యూజిలాండ్ టూర్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు, చేర్పులపై కూడా మాట్లాడామని పేర్కొంది. గడిచిన నాలుగైదు సంవత్సరాల కాలంలో తాను ఎంతోమంది కెప్టెన్ల సారథ్యంలో ఎన్నో మ్యాచ్‌లలో ఆడానని, ఆయా మ్యాచ్‌లలో ఆడిన అనుభవంతోపాటు కెప్టెన్లు ఇచ్చిన స్ఫూర్తితో సోమవారం నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే టీ-20లో ముందుకు సాగి సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు శతవిధాలా పోరాడతామని ధీమా వ్యక్తం చేసింది.