క్రీడాభూమి

బీవౌంట్ అర్ధ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మార్చి 4: టామీ బీవౌంట్ అర్ధ సెంచరీతో చెలరేగడంతో గౌహతి వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌పై 41 పరుగుల తేడాతో ఓడింది. టాస్ గెలి చి ముందుగా టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు మొద టి నుంచి ధాటిగా ఆడారు. ఓపెనర్లిద్ద రూ మొదటి వికెట్ 89 పరగులు జోడిం చారు. ఆ తర్వాత డానియెల్లి వ్యాట్ (35)ను శిఖా పాండే పెవిలియన్ పంప గా, మరో ఆరు పరుగులు జోడించాక ఇంగ్లీష్ జట్టు నటాలీ స్కీవర్ (4) వికెట్ ను కూడా కోల్పోయంది. దీంతో క్రీజులో కి వచ్చిన కెప్టెన్ హీదర్ నైట్, మరో ఓపెనర్ టామీ బీవౌంట్‌తో కలిసి వేగం గా ఆడుతూ జట్టును స్కోరును పెంచా రు. ఈ క్రమంలో నైట్ (40) దీప్తీ శర్మ బౌలింగ్‌లో దేదా కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెథరిన్ బ్రంట్‌తో కలిసి బీవౌంట్ (62) ధాటిగా ఆడుతూ తన కెరీర్‌లో ఐదో అర్ధ సెంచరీ పూర్తిచే సుకుంది. చివరి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి స్టాంపవుట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత బ్రంట్ (4), లారెన్ విన్‌ఫీల్డ్ (2) నాటౌట్‌గా ఉన్నారు. దీంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లో 4 వికెట్లు కోల్పో య, 160 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్‌కు 2, శిఖా పాండే, దీప్తి శర్మకు తలో వికెట్ లభిం చింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 119 పరుగులు మాత్రమే చేసి, 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత బ్యాటర్లలో దీప్తీ శర్మ (22, నాటౌట్), శిఖా పాండే (23, నాటౌట్) మినహా మరెవరూ రాణించలే దు. ఇంగ్లాండ్ బౌలర్లలో కెథరిన్ బ్రంట్, లిన్‌సీ స్మిత్‌లకు 2, అన్యశ్రుబ్‌సోల్, కాటె క్రాస్‌కి తలో వికెట్ దక్కింది. దీంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇం గ్లాండ్ 1-0 తేడాతో ఆధిక్యం సంపా దించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టామీ బీవౌంట్‌కు దక్కింది.