క్రీడాభూమి

అవకాశాలు ఫుల్.. ఆట నిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: ఆస్ట్రేలియాతో గతేడాది జరిగిన టెస్టులో అద్భుతంగా రాణించిన భారత యువ వికెట్ కీపర్ సంచలనం రిషభ్ పంత్ వరుస వైఫల్యాలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీపర్‌గా కంటే ఆ స్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌కు దీటుగా చేసిన స్లెడ్జింగ్‌తోనే పంత్ అం దరికీ సుపరిచితుడయ్యాడు. అప్పటికీ ఐపీఎల్ మ్యాచు ల్లో ఆడినా పెద్దగా ఎవరికి తెలియని రిషభ్ పేరు మార్మో గింది. అంతేకాకుండా ఆ సిరీస్‌లో సెంచరీ చేసి అందరికీ దగ్గరయ్యాడు. ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం, దినేష్ కార్తీక్ కొన్ని కారణాల వల్ల జట్టుకు దూరం కావడం పంత్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో రిషభ్ అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా నిలిచి ప్రతి ఒక్కరినీ తనవైపు తిప్పుకున్నాడు. ఇక బేబీ సిట్టర్‌గా చేసిన హంగామాతో ప్రపంచ వ్యాప్తంగా రిషభ్ అభిమానులను సంపాదించుకోగలిగాడు. ఒక రకంగా చెప్పాలంటే స్లెడ్జింగ్, బేబీ సిట్టర్ ఘటనలే జట్టులో రిషభ్ ఉండేందుకు కారణమయ్యాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
వెనకేసుకొస్తున్న కెప్టెన్, కోచ్..
భారత జట్టులో మిగతా కుర్ర ఆటగాళ్లతో పోలిస్తే రిషభ్ పంత్ స్టయలే వేరు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్ర్తి పంత్ వరుసగా విఫలమవుతున్నా అవకాశా లిస్తున్నారు. ఒకానొక సమయంలో రానున్న రోజుల్లో పంత్‌కు వీలైనంతా అవకాశాలు కల్పిస్తామని కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. అయతే ప్రస్తుత వికెట్ కీపర్ ధోనీ టెస్టులకు గుడ్ బై చెప్పడం, వనే్డలు, టీ20ల్లో మును పటిలా రాణించకపోవడం చూసే కోహ్లీ ఈ నిర్ణయం తీసు కొని ఉంటాడనుకుంటున్నారు.
మొదటి వనే్డలో దక్కని చోటు..
వరుసగా విఫలమవుతూ వస్తున్న రిషభ్‌పంత్‌ను ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వనే్డకు దూరం పెట్టారు. అ తడి స్థానంలో అంబటి రాయుడిని బరిలో దించారు. అ యతే మ్యాచ్‌కు ముందు ధోనీ గాయపడగా, అతడి స్థా నంలో రిషభ్ తీసుకుంటారని వినిపించినా, చివరికి ధోనీ నే బరిలోకి దిగాడు. మరోవైపు అంబ టి రాయుడు సైతం మొదటి వనే్డలో విఫలం కావడంతో, రెండో వనే్డలో రిషభ్ చోటు ఇస్తారా?లేనిది అనుమా నంగానే ఉంది.
దినేష్ పరిస్థితి ఏంటి?
రెగ్యూలర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి టెస్టులకు గుడ్‌బై చెప్పిన తర్వాత వృద్ధిమాన్ సాహా, దినేష్ కార్తీక్, పార్థీవ్ పటేల్ ఆశించిన స్థాయలో రాణించలేదు. దీంతో రిషభ్ తెరమీదికొచ్చాడు. పంత్ ఎంట్రీతో దినేష్ కార్తీక్ తుది జట్టులో చోటు కోసం మిగతా కుర్రాళ్లతో పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. దినేష్ కార్తీక్ ఇటీవల ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో తన ప్రదర్శ నతో ఆకట్టుకున్నాడు. అయ నా రాబోయే ప్రపంచకప్ జాబితాలో రిషభ్ పేరు పదిల మనే చెప్పాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో దినేష్‌ని కేవలం టీ20లకు మాత్రమే ఎంపిక చేసి వనే్డ జట్టులో చోటు కల్పించకపోవడంతో దీనికి బలం చేకూరిం ది. అయతే చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ మాత్రం దినేష్ కార్తీక్ చోటు పై ఆశాజనకంగానే మాట్లాడడం గమనార్హం.
ఐదు ఇన్నింగ్స్‌లు.. 76 పరుగులు..
బోర్డర్- గవాస్కర్ సిరీస్‌లో రాణించిన రిషభ్ పంత్ దూకుడు చూసి అంతా భారత్‌కు మరో ధోనీ దొరికినట్లేనని భావించారు. అయతే టెస్టులతో పాటు వనే్డలు, టీ20ల్లోనూ రిషభ్ ధోనీకి బ్యాకప్ వికెట్ కీపర్‌గా మేనేజ్‌మెంట్ ఎంపిక చేస్తున్నా పంత్ మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. పంత్ గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 4, 40 (నాటౌట్), 28, 3, 1 పరుగులు మాత్రమే చేశాడు. అంటే మొత్తం 76 పరుగులతో పేలవమైన ప్రద ర్శన చేశాడు.