క్రీడాభూమి

బ్యాటింగే బలహీనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్: టీ20 సిరీస్ ఓటమి తర్వాత హైదరాబాద్‌లో జరిగిన మొదటి వనే్డలో 6 వికెట్ల తేడాతో గెలిచి భారత్ సత్తా చాటింది. అయతే గత వనే్డలో భారత టాప్ ఆర్డడర్ మరోసారి నిరాశ పరిచింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 236 పరుగులను ఛేదించేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడిన తొలి బంతికే పెవిలియన్ చేరగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డాడు. అయతే కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించినా, దురదృష్టం మరోసారి వెంటాడడంతో త్రుటిలో అర్ధ సెంచరీ చేజార్చు కున్నాడు. అయతే కోహ్లీ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు సైతం నిరాశ పరచడంతో 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన సీని యర్ బ్యాట్స్‌మెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం మొదట్లో పరుగులు రాబట్టేందుకు కష్టపడడంతో మ్యాచ్ దాదాపుగా చేజారినట్లేనని భావించారంతా. కానీ అనుహ్యంగా కేదార్ జాదవ్, ధోనీ అర్ధ సెంచరీలతో మరో వికెట్ పడకుండా జాగ్ర త్తగా ఆడి జట్టును గెలిపించారు.
గెలిచినా ఆందోళనే..
మొదటి వనే్డలో అతి కష్టంమీద గెలిచినా టాప్ ఆర్డర్ వైఫల్యం వెంటాడుతోంది. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా తో జరిగిన టీ20 సిరీస్ కోల్పోయన విషయం తెలిసిందే. అయ తే బ్యాటింగ్‌లో లోపాలు సరిదిద్దుకోవాల్సిన అవసరముంది. ప్రపంచకప్‌కు ముందు మరో నాలుగు వనే్డలు ఆడాల్సిన భారత్, ఆలోపే బ్యాటింగ్ సమస్యను అధిగమించాలని అంద రూ కోరుకుంటున్నారు.
గబ్బర్ డౌటే..
మొదటి వనే్డలో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన ధావన్‌కి రెండో వనే్డలో తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగానే ఉంది. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన ధావన్ మొత్తం 243 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు న్నాయ. అయతే వరుసగా విఫలమవుతున్నా ధావన్ స్థానంలో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కి తుది జట్టులో చోటు దక్కే అవకాశ ముంది. అలాగే ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ స్థానంలో రిషభ్‌పంత్‌ను ఆడించే అవకాశముంది.
జట్ల అంచనా..
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, విజయ్ శంకర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, రిషభ్ పంత్, సిద్దార్థ్ కౌల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా.
ఆస్ట్రేలియా: ఆరోన్ పింఛ్ (కెప్టెన్), డీఆర్సీ షార్ట్, షాన్ మార్ష్, మార్కస్ స్టొయనిస్, ఉస్మాన్ ఖాజా, అలెక్ స క్యారీ, పీటర్ హాండ్స్‌కాంబ్, అస్టాన్ టర్నర్, ఆడం జంపా, జాసన్ బెహ్రెన్ డ్రాఫ్, జే రిచర్డ్‌సన్, ప్యాట్ కమిన్స్, అండ్రూ టై, నాథన్ కౌల్టర్- నైల్, నాథన్ లియాన్.
చిత్రాలు.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మహేంద్రసింగ్ ధోనీ
*నెట్ ప్రాక్టీస్‌లో విరాట్ కోహ్లీ