క్రీడాభూమి

ధోనీ గోల్డెన్ డక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, మార్చి 5: మొదటి వనే్డలో అర్ధ సెంచరీతో రాణించి జట్టును గెలిపించిన టీమిండియా సీనియర్ బ్యాట్ సమెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ నాగ్‌పూర్ వేదికగా జరగుతున్న రెండో వనే్డలో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు ధోనీ తొమ్మిదేళ్ల క్రితం ఇదే ఆస్ట్రేలియా జట్టుపై విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. అయతే ప్రస్తుతం జరుగుతున్న రెండే వనే్డలో ఆడం జంపా వేసిన 33వ ఓవర్‌లో మూడో బంతిని ఆడిన ధోనీ స్లిప్‌లో ఖాజాకు దొరికపోయాడు. దీంతో ఆడిన మొదటి బంతికే గోల్డెన్‌డక్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
ఓవరాల్‌గా ఐదోసారి..
ధోనీ గోల్డెన్ డక్‌గా అవుటవడం ఇది మొదటిసారేం కాదు. 2004లో చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ ధోనీ గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా, ఆ తర్వాత 2005లో అహ్మదాబాద్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, 2007లో పోర్ట్ ఆఫ్ స్పెయన్ వేదికగా మళ్లీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, చివరిసారిగా 2010లో విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

చిత్రాలు.. ఆట మధ్యలో మైదానంలోకి వచ్చి ధోనీని కౌగిలించుకున్న అభిమాని
* వెంటనే అభిమానిని మైదానం బయటకు తీసుకెతున్న సిబ్బంది