క్రీడాభూమి

పన్ను మినహాయింపు కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: భారత్‌లో 2021లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2023లో ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో వీటికి పన్ను మినహాయంపు కావాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బీసీసీఐ కోరిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీసీసీఐ అలా కుదరదని తేల్చి చెప్పింది. కావాలంటే రెండు ఈవెంట్లను మరో దేశంలో నిర్వహించుకోవచ్చని బదులిచ్చింది. ఐసీసీ త్రైమాసిక సమావేశంలో భాగంగా ఈ విషయమై చర్చకు వచ్చింది. ఒకవేళ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయంపు లేదంటే, బీసీసీఐ ఆ మొత్తాన్ని భరించాలని ఐసీసీ కోరింది. సాధారణంగా దిగుమతి చేసుకునే యంత్రాలపై పన్ను విధిస్తారు. అయతే ప్రపంచ కప్‌ను స్టార్ నెట్‌వర్ క ప్రసారం చేయనుంది. ఇప్పటికే భారత్‌లో స్టార్‌కు సంబంధించిన పూర్తి యంత్రాలు, యంత్రాంగం ఉన్నప్పుడు మినహాయంపు ఎందుకని బీసీసీఐ ఎదురు ప్రశ్నించింది.