క్రీడాభూమి

విరాట్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షోతో ఆస్ట్రేలియాతో నాగపూర్‌లో మంగళవారం జరిగిన రెండో వనే్డలో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యం సంపాదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యా టింగ్‌కు దిగిన భారత్ మొదటి ఓవర్‌లోనే రోహిత్ శర్మ (0) వికెట్‌ను కోల్పోయంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఈ క్రమంలో ధావన్ (21) మ్యా క్స్‌వెల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు (18) సైతం లియాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరడం తో 75 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయ టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో కోహ్లీ, విజయ్ శంకర్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి 81 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. మరోవైపు విజయ్ శంకర్ (46) అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి కేదార్ జాదవ్ (11), మహేంద్రసింగ్ ధోనీ (0)ని ఆడం జంపా వరుస బంతు ల్లో పెవిలియన్‌కు పంపాడు. అప్పటికీ భారత్ స్కోరు 6 వికెట్లకు 171 పరుగులు మాత్రమే. ఓవైపు వికెట్లు పడుతున్నా రవీంద్ర జడేజా సహకారంతో కోహ్లీ తన కెరీర్‌లో 40వ సెంచరీని పూర్తి చేశాడు. మరోవైపు జడేజా సైతం భారీ షాట్లకు యత్నించకుండా సింగిల్స్‌తోనే నెమ్మదిగా ఆడుతూ వచ్చాడు. వీరి జోడీని కమిన్స్ విడదీశాడు. కమిన్స్ వేసిన 46వ ఓవర్లో జడేజా (21) క్యాచ్ అవు ట్ రూపంలో వెనుదిరిగాడు. ఓవైపు ఇ న్నింగ్స్ దగ్గర పడు తుండడంతో కోహ్లీ (116) ధాటిగా ఆడే క్రమంలో కమిన్స్ బౌ లింగ్‌లో స్టొయనిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత 7 బంతుల్లోనే కుల్దీప్ యాదవ్ (3), జస్ప్రీత్ బుమ్రా (0), మహ మ్మద్ షమీ (2, నాటౌట్) వికెట్లను కోల్పోవడంతో భారత్ 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్‌కు 4, ఆడం జంపా 2, నాథన్ కౌల్టర్ నైల్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, నాథన్ లియాన్‌లకు తలో వికెట్ దక్కింది.
గెలవాలన్న కసితో..
మొదటి వనే్డలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలోనే ఆలౌ టైంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఆరోన్ పింఛ్ (37), ఉస్మాన్ ఖాజా (38), పీటర్ హాండ్స్‌కాంబ్ (48), మార్కస్ స్టొయనిస్ (52) మినహా మిగతా వారు రాణించకపోడంతో ఆస్ట్రేలియా 242 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, జస్ప్రీత్ బుమ్రా, విజయ్‌శంకర్‌లకు 2, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్‌కు తలో వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీకి లభించింది. మూడో వనే్డ మార్చి 8న రాంచీలో జరగనుంది.

చిత్రం.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ (116)