క్రీడాభూమి

ఏంటీ తడ‘బ్యాటు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఓవైపు ప్రపంచకప్ టోర్నీ ముంచుకొస్తుంది. మరోవైపు భారత బ్యాటింగ్ తడబడు తోంది! విదేశీ గడ్డలపై అద్భుత విజయాలు సాధించి, స్వ దేశంలో జరగుతున్న సిరీస్‌లో తడ‘బ్యాటు’ ప్రతి క్రికెట్ అభిమానిని ఆందోళనకు గురిచేస్తోంది! ఇన్నా ళ్లూ అన్ని దేశాలపై విజయాలు సాధించి, ప్ర పంచ క్రికెట్‌ను శాసి స్తున్న టీమిండియా, సొంతగడ్డపై సరైన ప్రదర్శన చేయ డం లేదనే విమర్శలందుకుంటోంది! ఇప్పటికే ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో నెగ్గగా, హైద రాబాద్‌లో జరిగిన మొదటి వనే్డలో భారత్ అతి కష్టంమీద గెలిచింది.
ఆసీస్‌తో టీ20 నుంచి..
ఆస్ట్రేలియా జరిగిన మొదటి టీ20లో భార త్ గెలుపు వరకు వచ్చి కేవలం 3 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (50) మినహా అందరూ విఫలమ య్యారు. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 8 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 17 బం తులాడి 24 పరుగులు చే యగా, రిషభ్ పంత్ (3) అనవసర పరుగుకు యత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. దినేష్ కార్తీక్ సైతం 3 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ధోనీ (29, నాటౌట్) క్రీజులో ఉ న్న ఇన్నింగ్స్ దగ్గరపడడంతో ప్రత్యర్థి ముం దు 126 పరుగుల స్పల్ప లక్ష్యం ఉంచాల్సి వ చ్చింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగి న కం గారూలు 3 వికెట్లతో విజయం సాధించారు.
ఇక రెండో టీ20లో శిఖర్ ధావన్ 24 బం తులాడి 14 పరుగులు చేసి అవుట్ కాగా, రిషభ్ పంత్ 6 బంతులను ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరా డు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ విరా ట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ ఫర్వాలేదని పించినా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో మరో రెండు బంతులుండగానే విజ యం సాధించింది.
వనే్డల్లోనూ అదే ప్రదర్శన..
హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి వనే్డలోనూ భారత బ్యా ట్స్‌మెన్లు తడబడ్డారు. ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడిన తొలి బంతికే డక్ అవుట్ కాగా, మరో ఓపెనర్ రోహి త్ శర్మ 66 బంతులాడి అతి కష్టం మీద 37 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ (44) ఫర్వాలేదని పించినా, అంబటి రాయుడు (13) విఫలమయ్యాడు. చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ (59), కేదార్ జాదవ్ (81) రాణించడంతో భారత్ విజయం అతి కష్టం మీదే విజయం సాధించింది.
నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వనే్డలో ఓపెనర్ రోహిత్ శర్మ 6 బంతులాడి పరుగు లేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరగా, శిఖర్ ధావన్ (21) మరోసారి నిరాశ పరిచాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ(116) మినహా అంతా విఫలమయ్యారు. అంబటి రాయుడు (18), కేదార్ జాదవ్ (11), మహేంద్రసింగ్ ధోనీ (0), రవీంద్ర జడేజా (21), కుల్దీప్ యాదవ్ (3), జస్ప్రీత్ బుమ్రా (0) దారుణంగా విఫలమ య్యారు. అయతే చివర్లో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 8 పరుగుల తేడాతో భారత్ మ్యాచ్ నెగ్గింది.
చిత్రాలు.. మహేంద్ర సింగ్ ధోనీ *శిఖర్ ధావన్ *రోహిత్ శర్మ