క్రీడాభూమి

సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి నివాళిగా ఆర్మీ క్యాప్‌లతో టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచి, మార్చి 8: జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గతనెల 14న జరిగిన జైషే ఉగ్రవాద సంస్థ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి నివాళిగా టీమిండియా క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌లు ధరించారు. ఆస్ట్రేలియా-్భరత్ మధ్య రాంచీలో శుక్రవారం జరిగిన మూడో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు సభ్యులంతా ఆర్మీ క్యాప్‌లను ధరించి బరిలోకి దిగడం ద్వారా ఉగ్రదాడిలో అసువులు బాసిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు ఘనంగా నివాళి అర్పించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన టాస్ సందర్భంగా బీసీసీఐ లోగో కూడిన మిలటరీ క్యాప్ ధరించి వచ్చి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీడా స్ఫూర్తి చాటాడు. అంతేకాకుండా ఈ మూడో వనే్డ మ్యాచ్ ద్వారా తమ జట్టుకు వచ్చే పారితోషికాన్ని జాతీయ రక్షణ నిధికి అందజేయాలని టీమిండియా నిర్ణయం తీసుకుని గొప్ప ఔదర్యాన్ని చాటింది. ఇదిలావుండగా, టెర్రరిస్టు దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు గాను ప్రతిఒక్కరూ తమ వంతు సహాయం చేయడానికి ముందుకు రావాలని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. ‘ఈరోజు మేము ధరించిన క్యాప్‌కు ఒక ప్రత్యేక ఉంది. మరణించిన సాయుధ దళాలకు నివాళిగా వీటిని మేం ధరించాం. మూడో వనే్డలో మా జట్టుకు వచ్చే ఫీజు మొత్తాన్ని జాతీయ రక్షణ నిధికి జమ చేస్తాం. దివంగత ఆర్మీ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి’ అని కోహ్లీ పిలుపునిచ్చాడు. ఇదిలావుండగా, ముష్కర మూకల దాడిలో అసువులు బాసిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు క్యాప్‌లు ధరించి బరిలోకి దిగాలన్న ఆలోచన టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీకి కావడం విశేషం. ఎందుకంటే ధోనీ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ ర్యాంక్ హోదాలో గౌరవాన్ని అందుకుంటున్నాడు. ఈ హోదాలోనే ధోనీ తమ జట్టులోని సభ్యులందరికీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వనే్డ మ్యాచ్ సందర్భంగా క్యాప్‌లను అందజేశాడు. కాగా, ఈనెలలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ వేడుకల ద్వారా వచ్చే ఆదాయాన్ని సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందజేయాలని బీసీసీఐ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే.