క్రీడాభూమి

ముగ్గురికే ఏ ప్లస్ కాంట్రాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: బీసీసీఐ ప్రకటించిన 2018-19 వార్షిక కాంట్రాక్టుల్లో యువ వికెట్ కీపర్ సంచలనం రిషభ్ పంత్‌కు ఏ గ్రేడ్ దక్కింది. ఏడు నెలల క్రితం టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన పంత్ ప్రతి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. దీంతో బీసీసీఐ పంత్‌ను ఏ గ్రేడ్‌లో చేర్చింది. మరోవైపు గతేడాది ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ భువనేశ్వర్ కుమార్‌లను ఈ ఏడాది ఏ గ్రేడ్‌కే పరిమితం చేశారు. ప్రస్తుతం ఏ ప్లస్ గ్రేడ్‌లో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే కొనసాగుతున్నారు. వీరిలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లకు 20018-19 వార్షిక కాంట్రాక్టుల్లో భాగంగా రూ.7కోట్లు లభించనుండగా, ఏ గ్రేడ్ ఆటగాళ్లు రూ. 5కోట్లు, బీ గ్రేడ్ ఆటగాళ్లు రూ.3 కోట్లు, సీ గ్రేడ్ ఆటగాళ్లు రూ.1 కోటి అందుకోనున్నారు. మరోవైపు కొత్త ఆటగాళ్లలో ఆంధ్రా సంచలనం హనుమ విహారికి సీ గ్రేడ్‌లో స్థానం కల్పించగా, మయాంక్ అగర్వాల్, పృథ్వీషాలకు ఎలాంటి గ్రేడ్ కల్పించలేదు.
గ్రేడ్‌ల వారీగా ఆటగాళ్ల వివరాలు:
ఏ ప్లస్: విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రోహిత్ శర్మ
ఏ: ఎంఎస్ ధోనీ, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మ ద్ షమీ, కుల్దీప్ యాదవ్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమా ర్, అంజిక్యా రహానే.
బీ: కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, ఉమేశ్ యాదవ్, యుజువేంద్ర చాహాల్
సీ: కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్, అంబటి రాయుడు, మనీష్ పాండే, హనుమ విహారి, ఖలీల్ అహమ్మద్, వృద్దిమాన్ సాహా.