క్రీడాభూమి

మెస్సీ ‘ఫ్రీ’ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలెన్షియా, మే 12: సాకర్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న లియోనెల్ మెస్సీ ఖాతాలో మరో రికార్డు చేరింది. బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అర్జెంటీనా సూపర్ స్టార్ స్పానిష్ సాకర్ లీగ్ ‘లా లిగా’లో భాగంగా ఎస్పానియల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రీ కిక్ ద్వారా ఒక గోల్ చేశాడు. ఈ ఏడాది అతను ఫ్రీ కిక్‌ను సద్వినియోగం చేసుకోవడం ఇది ఏడోసారి. మొత్తం మీద 23 గోల్స్‌ను ఈ విధంగా సాధించిన అతను రొనాల్డ్ కోమన్ నెలకొల్పిన క్లబ్ రికార్డును సమం చేశాడు. 1992లో యూరోపియన్ చాంపియన్‌షిప్‌ను బార్సిలోనా కైవసం చేసుకోవడంలో కోమన్ కీలక పాత్ర పోషించాడు. అతని ఫ్రీ కిక్ బార్సిలోనాకు టైటిల్‌ను సాధించిపెట్టింది. కాగా, ఫ్రీ కిక్స్‌లో తనకు తిరుగులేదని నిరూపిస్తున్న మెస్సీ ఈ తరహాలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడిగా గుర్తింపు సంపాదించాడు. కోమన్ రికార్డును సమం చేసిన అతను త్వరలోనే కొత్త రికార్డును నెలకొల్పడం ఖాయం. ఈ ఏడాది ఇప్పటి వరకూ బార్సిలోనాకు 43 మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించిన మెస్సీ 37 గోల్స్ సాధించాడు. మొత్తం మీద అతను బార్సిలోనా తరఫున 347 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి 312 గోల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.