క్రీడాభూమి

కోహ్లీ సెంచరీ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 8: కోహ్లీ సూపర్ సెంచరీ చేసినా భారత్ 31 పరుగులతో ఓటమి చవిచూసింది. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన మూడో వనే్డలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణిత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ 313 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖాజా అచితూచి ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఓవైపు నిలకడగా ఆడుతూ, మరోవైపు జట్టును స్కోరు పెంచే క్రమంలో ఆరోన్ ఫించ్ (93) కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బీగా అవుటయ్యాడు. మొదటి వికెట్‌కు ఫించ్, ఖాజా 193 పరుగుల భాగస్వామ్యాన్ని అందిం చారు. ఆ తర్వాత భారత టూర్‌లో మంచి ఫాంలో ఉన్న గ్లేన్ మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చి బౌండరీలతో విరుచుకు పడ్డారు. మరోవైపు ఉస్మాన్ ఖాజా (104) కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసి, వెంటనే షమీ బౌలింగ్‌లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి పెవిలి యన్‌కు చేరాడు. ఆ వెంటనే మ్యాక్స్‌వెల్ (47) రనౌట్ కాగా, షాన్ మార్ష్ (7), పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (0) సింగిల్ డిజిట్‌కే అ వుటయ్యారు. మార్కస్ స్టొయనిస్ (31, నాటౌట్), అలెక్ స క్యారీ (21, నాటౌట్) చివరివరకు క్రీజులో నిలవడంతో ఆస్ట్రేలియా 313 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు మూడు, మహమ్మద్ షమీకి ఒక వికెట్ దక్కింది.
ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (1) రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో నాలుగు పరుగులు జోడించాక రోహిత్ శర్మ (14), అంబటి రాయుడు (2)లను కమిన్స్ పెవిలియన్‌కు పంపడంతో భారత్ 27 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయ కష్టాల్లో పడింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ భారమంతా తన భుజాన వేసుకున్నాడు. సినీయర్ బ్యాట్స్‌మెన్, లోకల్ బాయ్ మహేంద్రసింగ్ ధోనీతో కలిసి జట్టు స్కోరును వేగంగా పెంచారు. ఈ క్రమంలో ధోనీ (26) జంపా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ధోనీ చేసిన పరుగుల్లో 14 పరుగులు బౌండరీల రూపంలోనే రావడం విశేషం. మరోవైపు కేదార్ జాదవ్‌తో జతకట్టిన కోహ్లీ నిలకడగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇంతలోనే కోహ్లీ తన కెరీర్‌లో 41వ సెంచరీని పూర్తిచేశాడు. ఈ క్రమంలో కేదార్ జాదవ్ (26) వికెట్‌ను భారత్ కీలక సమయంలో కోల్పోయంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌తో కలిసి కోహ్లీ (123) ధాటిగా ఆడే క్రమంలో జంపా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపటికే విజయ్ శంకర్ (32), రవీంద్ర జడేజా (24), కుల్దీప్ యాదవ్ (10), మహమ్మద్ షమీ (8) అవుట్ కావడంతో భారత్ 48.2 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. దీంతో 5 వనే్డల మ్యాచ్ సిరీస్‌లో 2-1తో ఆస్ట్రేలియా వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, రిచర్డ్‌సన్, జంపాకు తలా మూడు వికెట్లు దక్కగా, నాథన్ లియాన్ 1 వికెట్ లభించింది.
లేటు వయసులో సెంచరీ..
ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖాజా మూడో వనే్డలో 113 బంతుల్లో 104 పరుగులు చేసి కెరీర్‌లో మొదటి సెంచరీ సాధించాడు. అయతే ఖాజా లేటు వయసులో (32 ఏళ్ల 80 రోజులు) ఈ సెంచరీ సాధించడం విశేషం. ఖాజా కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ వోగ్స్ (33 ఏళ్ల 129 రోజులు) ఈ ఫీట్ సాధించగా, ఆస్ట్రేలియాకే చెందిన బ్రాడ్ హడ్జ్ (32 ఏళ్ల 79 రోజులు), డేవిడ్ హస్సీ (33 ఏళ్ల 44 రోజులు) కూడా లేటు వయసులోనే సెంచరీ సాధించడం గమనార్హం.

స్కోర్ బోర్డు..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఆరోన్ ఫించ్ ఎల్‌బీడబ్ల్యూ (బీ) కుల్దీప్ యాదవ్ 93, ఉస్మాన్ ఖాజా (సీ) బుమ్రా (బీ) షమీ 104, గ్లేన్ మ్యాక్స్‌వెల్ రనౌట్ (రవీంద్ర జడేజా/్ధనీ) 47, షాన్ మార్ష్ (సీ) విజయ్ శంకర్ (బీ) కుల్దీప్ యాదవ్ 7, మా ర్కస్ స్టొయనిస్ (నాటౌట్) 31, పీటర్ హ్యాండ్స్‌కాంబ్ ఎల్‌బీ డబ్ల్యూ (బీ) కుల్దీప్ యాదవ్ 0, అలెక్స్ క్యారీ (నాటౌట్) 21.
ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 313 (50 ఓవర్లలో 5 వికెట్లకు)
వికెట్ల పతనం: 1- 193, 2-239, 3-258, 4-263, 5-263.
బౌలింగ్: మహమ్మద్ షమీ 10-0-52-1, జస్ప్రీత్ బుమ్రా 10-0-53-0, రవీంద్ర జడేజా 10-0-64-0, కుల్దీప్ యాదవ్ 10-0-64-3, విజయ్ శంకర్ 8-0-44-0, కేదార్ జాదవ్ 2-0-32-0.
భారత్ ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ (సీ) మ్యాక్ సవెల్ (బీ) జే రిచర్డ్‌సన్ 1, రోహిత్ శర్మ ఎల్‌బీడబ్ల్యూ (బీ) ప్యాట్ కమిన్స్ 14, విరాట్ కోహ్లీ (బీ) జంపా 123, అంబటి రాయుడు (బీ) ప్యాట్ కమిన్స్ 2, ఎంఎస్ ధోనీ (బీ) జంపా 26, కేదార్ జాదవ్ ఎల్‌బీడబ్ల్యూ (బీ) జంపా 26, విజయ్ శంకర్ (సీ) రిచర్డ్‌సన్ (బీ) లియాన్ 32, రవీంద్ర జడేజా (సీ) మ్యాక్ సవెల్ (బీ) రిచర్డ్‌సన్ 24, కుల్దీప్ యాదవ్ (సీ) ఫించ్ (బీ) ప్యాట్ కమిన్స్ 10, మహమ్మద్ షమీ (సీ) ప్యాట్ కమిన్స్ (బీ) రిచర్డ్‌సన్ 8, జస్ప్రీత్ బుమ్రా (నాటౌట్) 0.
ఎక్స్‌ట్రాలు: 15, మొత్తం: 281 (48.2 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-11, 2-15, 3-27, 4-86, 5-174, 6-219, 7-251, 8-273, 9-281, 10-281.
బౌలింగ్: ప్యాట్ కమిన్స్ 8.2-1-37-3, జే రిచర్డ్‌సన్ 9-2-37-3, మార్కస్ స్టొయనిస్ 6-0-39-0, నాథన్ లియాన్ 10-0-57-1, ఆడమ్ జంపా 10-0-70-3, గ్లేన్ మ్యాక్స్‌వెల్ 5-0-30-0.