క్రీడాభూమి

విండీస్ మరీ దారుణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బస్సెటెర్రి, మార్చి 9: పొట్టి ఫార్మాట్‌కు కేరాఫ్ అడ్రస్ అయినా కరేబియాన్ జట్టు, అదే ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజ యాన్ని మూటగట్టుకుంది. శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో టాస్ గెలిచిన విండీస్ ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించిం ది. దీంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో జోరూట్ (55), స్యామ్ బిల్లింగ్స్ (87) రాణించడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 182 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన టీ20 డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ కేవలం 45 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో శిమ్రాన్ హెట్‌మెయర్ (10), కార్లోస్ బ్రాత్‌వైట్ (10) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా, డేవిడ్ విల్లే, అదిల్ రషీద్, లియామ్ ప్లంకెట్ తలా రెండేసి వికెట్లు తీశారు. టీ20 చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. గతంలో శ్రీలంక చేతిలో పసికూన నెదర్లాండ్స్ 39 పరుగులకే ఆలౌటైంది.