క్రీడాభూమి

వార్న్ టెస్టు జట్టులో సచిన్‌కు నాలుగో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 16: ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఎంపిక చేసిన భారత అత్యుత్తమ టెస్టు జట్టులో సచిన్ తెండూల్కర్‌కు స్థానం లభించింది. మొత్తం 11 మంది భారత క్రికెటర్ల పేర్లను పేర్కొన్న వార్న్ 12వ ఆటగాడిగా వివిఎస్ లక్ష్మణ్ పేరును ఖాయం చేశాడు. సచిన్‌కు ఎలెవెన్‌లో చోటు కల్పించినప్పటికీ, అతనిని నాలుగో స్థానానికి నెట్టేసిన వార్న్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అతను ఎంపిక చేసిన భారత అత్యుత్తమ టెస్టు జట్టులో మొదటి మూడు స్థానాలు వీరేందర్ సెవాగ్, నవ్‌జోత్ సింగ్ సిద్ధు, రాహుల్ ద్రవిడ్‌లకు దక్కాయి. సచిన్ నాలుగో స్థానంలో ఉండగా, ధోనీతోఎప్పుడూ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినప్పటికీ అతని పేరును వార్న్ తన జట్టులో చేర్చాడు.
వార్న్ ప్రతిపాదించిన భారత అత్యుత్తమ టెస్టు క్రికెట్ జట్టు..
వీరేందర్ సెవాగ్, నవ్‌జోత్ సింగ్ సిద్ధు, రాహుల్ ద్రవిడ్, సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మహమ్మద్ అజరుద్దీన్, కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ, అనీల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జవగళ్ శ్రీనాథ్. 12వ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్.

రామ్ శ్లామ్‌లో ఫిక్సింగ్ కలకలం
జొహానె్నస్‌బర్గ్, డిసెంబర్ 16: దక్షిణాఫ్రికాలో ప్రతిష్ఠాత్మక రామ్ శ్లామ్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఫిక్సింగ్ కలకలం రేగింది. ‘ఒక వ్యక్తి’పై ఫిక్సింగ్ అనుమానాలు వ్యక్తమయ్యాయని, తక్షణమే అతనిని సస్పెండ్ చేశామని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సిఎస్‌ఎ) ప్రకటించింది. ‘ఒక వ్యక్తి’ అన్న పదాన్ని మాత్రమే ఉపయోగించిన సిఎస్‌ఎ పేరును వెల్లడించలేదు. విచారణ జరుగుతున్నదని, త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన రామ్ శ్లామ్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని సిఎస్‌ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లార్గట్ వ్యాఖ్యానించాడు. తాము పేర్కొన్న వ్యక్తికి జట్టుతోగానీ, సిఎస్‌ఎతోగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. అయితే, అతనికి ఎవరెవరు సహకరించారు, ఎంతమందికి ఇందులో ప్రమేయం ఉంది అన్న ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు సిఎస్‌ఎ ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టిందని వివరించాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నాడు.