క్రీడాభూమి

బంగ్లాపై న్యూజిలాండ్ ఇన్నింగ్స్ విక్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, మార్చి 12: నెయల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్ విజృంభించడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే కుప్పకూలింది. ఫలింతంగా ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ 12 పరుగుల ఇన్నింగ్స్ విజయం సాధించి, మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 80 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ మహ్మదుల్లా (67), మహమ్మద్ మిథూన్ (47), షాద్మన్ ఇస్లాం (29), సౌమ్య సర్కార్ (28) మినహా మరెవరూ రాణించకపోవడంతో 209 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో నెయల్ వాగ్నర్ 5, ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించడంతో కివీస్ 12 పరుగుల ఇన్నింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన న్యూజిలాండ్ సినీయర్ ఆటగాడు, ఆల్‌రౌండర్ రాస్ టేలర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు శనివారం నుంచి జరగనుంది.
*
సంక్షిప్త స్కోర్ బోర్డు
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 211 (ఆలౌట్)
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: 432/6 (డిక్లేర్డ్)
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 209 (ఆలౌట్)