క్రీడాభూమి

ఆఖరి ప్రయోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విదేశీ గడ్డపై వరుస సిరీస్‌లు గెలుచుకున్న టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టోర్నీలో ఆది నుంచి తడబడింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్, ఫీల్డింగ్‌లో పూర్తిగా విఫలమైంది. గత నెల 24 నుంచి మొదలైన టోర్నీలో మొదటి రెండు టీ20 మ్యాచ్‌లను ఓడి పోయన భారత్, వనే్డల్లో రెండు వరుస మ్యాచ్‌లు గెలిచింది. అయతే గెలిచిన రెండు మ్యాచ్‌లు సైతం స్వల్ప తేడాతోనే కావడం గమనార్హం. ఇక మూడో వనే్డ కూడా గెలిచి ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలన్న టీమిండియా ఆశలపై కంగారూలు నీళ్లు చల్లారు. మూడో వనే్డలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ కేవలం 5 వికెట్లు కోల్పోయ 313 భారీ స్కోరు చేసింది. లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 281 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ మినహా మరెవరూ రాణించకపోవడంతో 32 పరుగులతో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 358 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. అయతే దారుణమైన బౌలింగ్‌కు తోడు పేలవమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను రెండు ఓవర్ల ముందే కంగారులకు అప్పగించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఇరు జట్లు 2-2 తేడాతో గెలుచుకోగా, బుధవా రం జరిగే మ్యాచ్ ఫలితం సిరీస్ విజేతలను తేల్చనుంది. మరోవైపు టీమిండియాకు ప్రపంచకప్ ముందు ఇదే చివరి వనే్డ.
ఓపెనర్లు రాణించినా..
టోర్నీ ఆద్యంతం విఫలమైన భారత ఓపెనర్లు మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ అద్భుతంగా రాణించారు. గత మ్యాచ్‌లో వీరిద్దరూ మొదటి వికెట్‌కు 193 పరగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. చాలా రోజుల తర్వాత శిఖర్ ధావన్ సెంచరీ చేసి తన వనే్డ కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరును నమోదు చేశాడు. ఇక మరో ఓపెనర్ రోహిత్ శర్మ సైతం రాణించినా త్రుటిలో సెంచ రీని చేజార్చుకున్నాడు. గత మూడు వనే్డల్లో బ్యాటింగ్ విఫలమైన భారత్, నాలుగో వనే్డలో భారీ స్కోరు చేసినా ఓడిపోవడం ఇటు ఆటగాళ్లతో పాటు అటు అభిమానులనూ నిరాశ పరిచింది. ప్రపంచకప్‌కు ముందు ఇలా జరగడం నిజంగా జీర్ణించుకోని విషయమే.
కొత్తగా ఫీల్డింగ్ సమస్య..
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచకప్‌కు ముందు టీమిండియా ఫీల్డింగ్ సమస్యను ఎదుర్కొంటోంది. గత మ్యాచ్‌లో పేలవమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్ చేజారింది. రిషభ్ పంత్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్, ఆస్టన్ టర్నర్‌ను రెండు సార్లు స్టంపింగ్ చేసే అవకాశాన్ని జారవిడిచాడు. అలాగే ధావన్ కూడా క్యాచ్‌లు వదిలేయడాన్ని అవకాశంగా తీసుకున్న పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్లు మ్యాచ్ విన్నర్లుగా మారడం విశేషం.
ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లే..
రాంచీ, మొహాలీ వేదికగా జరిగిన మ్యాచుల్లో భారీ స్కోర్లు నమోదైన విషయం తెలిసిందే. అయతే భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పిచ్‌పై తేమ ప్రభావంతోనే ఓడిపోయామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో చివరి వనే్డ జరగనున్న ఫిరోజ్ షా కోట్ల మైదానంలో తేమ ప్రభావం ఉండదని పిచ్ క్యూరేటర్లు చెప్పడంతో ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
బౌలర్ల పంథా మారాలి..
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వనే్డలో భారత బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చా రు. గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్న యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా సైతం గత మ్యాచ్‌లో 8.5 ఓవర్లు వేసి 63 పరుగులు సమర్పించుకొని, మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో వచ్చిన భువనేశ్వర్ కుమార్ సైతం 9 ఓవర్లు వేసి 67 పరుగులిచ్చాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఇక స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ కూడా పూర్తి ఓవర్లు చేసి 60 నుంచి 80 పరుగుల వరకు ఇవ్వడమూ గత మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం.

చిత్రాలు.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ
* నెట్ ప్రాక్టీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్ సమన్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్