క్రీడాభూమి

ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా గంగూలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: టీమిండి యా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ తమ జ ట్టుకు సలహాదారుగా నియమించు కుంది. ఈ మేరకు జట్టు యాజమా న్యం ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఆ జట్టు చైర్మన్ పార్థ్ జిందా ల్ మాట్లాడుతూ గంగూలీ అనుభ వం, సలహాలు, సూచనలు, జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని, అత ను తనకు కుటుంబ సభ్యుడితో సమానమని, తమ జట్టుకు సలహాదా రు డిగా పనిచేయడం ఆనందంగా ఉం దని వ్యాఖ్యానించా డు. అలాగే గంగూలీ మాట్లాడుతూ ఢిల్లీ క్యాపి టల్స్ జట్టుతో పనిచేయడం సంతో షంగా ఉందని, జిందాల్, జేఎస్ డబ్ల్యూ సంస్థల గురించి తనకు చాలా ఏళ్లుగా తెలుసునని అన్నాడు. వారు క్రీడా ప్రస్థానంలో భాగ మైనందుకు సంతోషంగా ఉందని గంగూలీ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి సౌరవ్ గంగూలీ పనిచేయనున్నాడు. ఢిల్లీ జట్టు ఇంతవ రకు ఒక్క ఐపీఎల్ సీజన్‌లోనూ ట్రోఫీ గెలవలేదు. ఈ నెల మార్చి 24న ముంబై ఇండియ న్స్‌తో, ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.