క్రీడాభూమి

శ్రీశాంత్‌కు సుప్రీం క్లీన్‌చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: తన క్రికెట్ కెరీర్ ఇంకా మిగిలే ఉందని భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగుతున్నప్పుడు, బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు శ్రీశాంత్‌పై ఆరోపణలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అతనితోపాటు ముంబయి స్పిన్నర్ అంకిత్ చవాన్, హర్యానాకు చెందిన అజిత్ చండీలాపై కూడా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) జీవితకాల సస్పెన్షన్‌ను విధించింది. తనపై వేటు వేయడాన్ని సవాలు చేస్తూ కొచ్చి కోర్టులో శ్రీశాంత్ పిటిషన్ వేసిన అనంతరం, సుదీర్ఘకాలం విచారణ, వాదనలు పూర్తయిన తర్వాత అతను నిర్దోషిగా బయటపడ్డాడు. నేరారోపణను రుజువు చేసే ఆధారాలు ఏవీ లేవని, కాబట్టి, అతనిని మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవచ్చని కోర్టు ప్రకటించింది. అయితే, ఈ తీర్పును బీసీసీఐ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. అక్కడ కూడా వాదోపవాదాలు ముగిసిన తర్వాత, శుక్రవారం తీర్పు వెలువడింది. శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీసీసీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే, ఇప్పటికే 36 ఏళ్లు రావడంతో, ఒకవేళ బీసీసీఐ సస్పెన్షన్‌ను ఎత్తివేసినా, జాతీయ జట్టులో చోటు దక్కడం అసాధ్యంగానే చెప్పాలి. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటి దేశీయ టోర్నీల్లో ఆడే అవకాశం వస్తుందా అన్న ది కూడా అనుమానంగా ఉంది. కానీ, శ్రీశాంత్ మాత్రం తన కెరీర్‌పై ధీమా వ్యక్తం చేశాడు. పీటీఐతో అతను మాట్లాడుతూ, ఇవాన్ లెండిల్ తన 42వ ఏట గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడని గుర్తుచేశాడు. తాను కూడా కెరీర్ కొనసాగించగలనని, క్రికెట్ ఆడే సత్తా ఇంకా తనకు ఉందని స్పష్టం చేశాడు. సుప్రీం కోర్టు తనకు క్లీన్ చిట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన శ్రీశాంత్ బీసీసీఐ వెంటనే స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు. సుప్రీం కోర్టు ఆదేశాలపై బోన్డు సానుకూలంగా స్పందించి, తనకు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలని కోరాడు. 2007 టీ-20 వరల్డ్ కప్, 2011 వనే్డ వరల్డ్ కప్‌లో ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న శ్రీశాంత్ ఈ ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో ఆడాలన్న అభిలాషను వ్యక్తం చేశాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇంగ్లాండ్‌లో కౌంటీ క్లబ్ క్రికెట్ ఆడలేనని స్పష్టం చేశాడు. అతను కెరీర్‌లో ఇంత వరకూ 27 టెస్టులు, 53 వనే్డ ఇంటర్నేషనల్స్, 10 టీ-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు.