క్రీడాభూమి

స్వదేశానికి బయల్దేరిన బంగ్లా క్రికెటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చ్, మార్చి 16: న్యూజిలాండ్‌లో ఉగ్రదాడి జరిగిన తర్వాత శనివారం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్వదేశానికి పయనమైంది. శుక్రవారం క్రైస్ట్‌చర్చ్‌లోని ఆల్‌నూర్ మసీదు వద్ద ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 49మందికి పైగా ప్రజలు మృతి చెందగా, మసీదులో ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లిన బంగ్లా క్రికెటర్లు త్రుటిలో తప్పించుకున్నారు. అనంతరం ‘తమ జట్టు సభ్యులమంతా ఉగ్రదాడి నుంచి క్షేమం గా బయటపడ్డాం. ఇదొక భయానక ఘటన. దయచేసి మా కోసం ప్రార్థనలు చేయండి’ అని బంగ్లాదేశ్ సినీయర్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు. షెడ్యూల్ ప్రకారం శనివారం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య మూడో టెస్టు జరగాల్సి ఉంది. కానీ ఉగ్రదాడి అనంతరం బంగ్లాదేశ్ మ్యాచ్‌ను రద్దు చేసుకొని స్వదేశానికి పయనమైంది. బంగ్లాదేశ్ క్రికెటర్ల మ్యాచ్ రద్దు నిర్ణయాన్ని ఐసీసీ కూడా సమర్థించింది. ఉగ్రదాడి జరిగిన ఘటనా స్థలానికి కొద్ది దూరంలోని హోటల్‌లో బస చేసిన క్రికెటర్లు శనివారం అదే దారి గుండా పోలీస్ ఎస్కార్ట్స్ సాయంతో బస్సులో ఎయర్‌పోర్ట్‌కు బయల్దేరారు. మొత్తం 17 మంది క్రికెటర్ల బృందంలో లిటాన్ దాస్, నయామ్ హసమ్, స్పిన్ బౌలింగ్ కోచ్, టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ జోషీ తదితరులున్నారు.