క్రీడాభూమి

మహిళల ఫైనల్‌కు కెర్బర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్, మార్చి 16: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో ప్రపంచ మాజీ నంబర్ వన్ ఏంజెలిక్ కెర్బర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో ఆమె బెలిండా బెన్సిక్‌ను 6-4, 6-2 తేడాతో ఓడించింది. అటు సర్వీసుల్లో, ఇటు స్మాష్‌లు, ప్లేసింగ్స్‌లో అద్భుత ప్రతిభ కనబరచిన కెర్బర్‌కు బెన్సిక్ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ప్రత్యర్థిని సులభంగానే ఓడించిన కెర్బర్ టైటిల్ ఫేవరిట్‌గా ఫైనల్‌లో బియాన్కా ఆండర్సన్‌ను ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్‌లో బియాన్కా 6-3, 2-6, 6-4 తేడాతో ఎలినా స్విటోలినాపై సంచలన విజయాన్ని నమోదు చేసింది.
మరోసారి నాదల్ వర్సెస్ ఫెదరర్
టెన్నిస్ అభిమానులు మరోసారి చిరకాల ప్రత్యర్థులు రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ మధ్య జరిగే పోరాటాన్ని చూసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇండియన్ వెల్స్ టెన్నిస్‌లో వీరిద్దరూ తమతమ ప్రత్యర్థులను ఓడించి, సెమీస్‌లో పరస్పరం ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నారు. క్వార్టర్ ఫైనల్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నాదల్ 7-6, 7-6 ఆధిక్యంతో కరెన్ కచనొవ్‌ను అతి కష్టం మీద ఓడించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న ఫెదరర్ 6-4, 6-4 స్కోరుతో హాబెర్ట్ హర్కాజ్‌పై విజయం సాధించి, సెమీస్ చేరాడు. ఇలావుంటే, మరో సెమీ ఫైనల్‌లో డామినిక్ థియేమ్, మిలోస్ రోనిక్ తలపడతారు.