క్రీడాభూమి

స్వదేశానికి బంగ్లా క్రికెటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, మార్చి 17: న్యూజిలాండ్ నుంచి బయల్దేరిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఢాకా చేరుకుంది. ఆట గాళ్లకు ఆ దేశ క్రీడా శాఖ మంత్రి జహీద్ ఎహసాన్ రస్సెల్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ హసన్ వారికి ఢాకాలోని హజరత్ షా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కెప్టెన్ మహమూద్ రి యాద్ విలేఖరులతో మాట్లాడాడు. తాము ఘటన జరిగిన రోజు క్రైస్ట్‌చర్చికి సమీపంలోని మసీదులో ప్రార్థనలకు వెళ్లి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని తెలిపాడు. ఈ ఘటనను వర్ణించడానికి తనకు ఇప్పటికీ మాటలు రావట్లే దని, అయతే తాము అక్కడి నుంచి ఐదు నిమిషా ల్లో బయటపడ్డామని తెలిపాడు. అభిమా నులు, ప్రజల ప్రార్థనల వల్లే క్షేమంగా స్వదేశానికి వచ్చి నట్లు పేర్కొన్నాడు. ఘటన అనంతరం వీలైనంత త్వరగా తమను స్వదేశానికి చేర్చిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఈ సందర్భంగా రియాద్ కృతజ్ఞతలు తెలిపాడు.
చిత్రం.. ఢాకాలోని హజరత్ షా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన బంగ్లా క్రికెటర్లు