క్రీడాభూమి

ఐసిసి ‘స్వతంత్ర’ చైర్మన్‌గా మనోహర్ ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 12: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి స్వతంత్ర ప్రతిపత్తిగల చైర్మన్‌గా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇతరత్రా ప్రతిపాదనలు ఏవీ రాకపోవడంతో, అతను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. ఐసిసికి గతంలో అధ్యక్షుడు ఒక్కడే ఉండేవాడు. అయితే, నిబంధనావళిని మార్చిన తర్వాత చైర్మన్ పదవి కూడా కలిసింది. అధ్యక్షుడు పాలన మండలికి నాయకత్వం వహిస్తే, చైర్మన్ ఐసిసికి సర్వాధికారిగా, సామాన్య పరిభాషలో చెప్పాలంటే మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహిస్తాడు. ఐసిసిలో పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న దేశాల్లో ఇద్దరు లేదా ముగ్గురు డైరెక్టర్ల ప్రతిపాదిస్తేనే చైర్మన్ పదవికి ఎవరైనా పోటీ చేయడానికి అర్హులు. ఈనెల 23వ తేదీ నాటికి నామినేషన్ గడువు పూర్తయింది. వచ్చేనెల అధికారికంగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయితే, మనోహర్ నామినేష్ మాత్రమే అందడంతో, అతను ఎన్నిక ఏకగ్రీవమైందని ఐసిసి ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాల్సిన ఆడిట్ కమిటీ చైర్మన్ అద్నాన్ జైదీ కూడా మనోహర్ ఎన్నికను ధ్రువీకరించాడు. ఒకే నామినేషన్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల అవసరం లేదని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకూ చైర్మన్‌గా వ్యవహరించిన మనోహర్ ఇక నుంచి ‘స్వతంత్ర’ చైర్మన్ హోదాలో ఐసిసికి మార్గదర్శకం చేస్తాడని చెప్పాడు.