క్రీడాభూమి

ఐపీఎల్ ప్రసారాలపై పాక్ నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)ను భారత్ నిషేధించగా, ఇప్పుడు పాక్ అందుకు ప్రతీకారం తీర్చుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాలపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాన్ చౌదరీ ధ్రువీకరించారు. పీఎస్‌ఎల్‌ను డిస్పోర్ట్ చానెల్ భారత్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయితే, పుల్వామా దాడి నేపథ్యంలో, ఆ ప్రసారాలను నిలిపివేసింది. ఆ ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జనాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అనంతరం, పీఎస్‌ఎల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రసార హక్కులను పొందిన ఐఎంజీ రిలయన్స్ హఠాత్తుగా కాంట్రాక్టు నుంచి వైదొలగింది. భారతీయ సంస్థలేవీ పీఎస్‌ఎల్ పట్ల ఆసక్తిని ప్రదర్శించలేదు. ఫలితంగా ఆ టోర్నీ నిర్వాహకులు కొత్త స్పా న్సర్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని, పాక్ సర్కారు ఎదురుదాడికి దిగింది. ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయరాదం టూ దేశంలోని అన్ని చానెళ్లకూ ఆదేశాలు జారీ చేసింది.