క్రీడాభూమి

ఒలింపిక్స్ గుడ్‌విల్ అంబాసిడర్స్ జాబితాలో రెహ్మాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: రియో ఒలింపిక్స్‌కు భారత్‌లో గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండాలంటే భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) నుంచి తనకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్న ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్ రెహ్మాన్ గురువారం ఆ జాబితాలో చేరాడు. ‘లెజెండరీ బ్యాట్స్‌మన్’ సచిన్ తెండూల్కర్, స్టార్ షూటర్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ఇప్పుడు రెహ్మాన్ కూడా చేరాడు. తనకు ప్రతిపాదన అందలేదని రెహ్మాన్ స్పష్టం చేసిన వెంటనే ఐఒఎ స్పందించింది. అతనిని సంప్రదించామని, బాధ్యతను స్వీకరించడానికి అతను అంగీకరించాడని ఐఒఎ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సచిన్ తదితరుల మాదిరిగానే రెహ్మాన్ కూడా ఒలింపిక్స్‌కు అద్భుత ప్రచారాన్ని కల్పిస్తాడన్న నమ్మకం ఉందని పేర్కొంది. ప్రజలను ప్రభావితం చేసే వక్యుల్లో రెహ్మాన్ కూడా ఒకరని తెలిపింది. గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఆయన అంగీకారం తెలపడం తమ అదృష్టమని పేర్కొంది