క్రీడాభూమి

అంతా రెఢి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 22: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయ. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జట్టు బలంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటికే మూడు సార్లు ట్రోఫీని గెలుచుకున్న ధోనీ సేన ఈసారీ అదే పట్టుదలతో బరిలోకి దిగనుంది. మరోవైపు కోహ్లీ సేన సైతం గత 11 సీజన్లలో ఒక్కసారీ ట్రోఫీని అందుకోలేదు. దీంతో ఎలాగైనా ఈ సీజన్‌లో ట్రోఫీని అందుకోవాలని తహతహలాడుతోంది.
చెన్నై మూడుసార్లు..
గత 11 సీజన్లలో ఐపీఎల్ బాగా రాణించిన జట్టేదంటే చెన్నై సూపర్‌కింగ్స్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ జట్టు మూడుసార్లు (2010, 2011, 2018) ట్రోఫీని గెలుచుకోగా, నాలుగు సార్లు (2008, 2012, 2013, 2015) రన్నరప్‌గా నిలిచింది. జట్టులో ధోనీ ఉండడమే ఆటగాళ్లకు అదనపు బలం. అంతకుముందు జట్టులో కొన్ని వివాదాలు చుట్టుముట్టినా ఆటగాళ్లు ఆత్మస్థైర్యంతో నిలబడి జట్టుకు కప్‌ను అందించారు. ప్రతి సీజన్లలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు లీగ్ దశ దాటింది. అందుకే 2019 సీజన్ ఐపీఎల్‌లోనూ ధోనీ సేనే ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.
కసితో రాయల్ ఛాలెంజర్స్..
ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీని అందుకోలేదు. ఏ జట్టులో లేని విధంగా హేమాహేమీలు ఉండి కూడా ఈ జట్టు ట్రోఫీ కల కలగానే మిగిలింది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకు వెళ్లినా నిరాశే మిగిలింది. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈసారి ట్రోఫీని సాధిస్తామని ధీమగా చెబుతున్నాడు.
చెన్నై సూపర్‌కింగ్స్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్‌కీపర్), సురేశ్ రైనా, అంబటి రాయుడు, షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్, మురళీ విజయ్, కేదార్ జాదవ్, సామ్ బిల్లింగ్స్, రవీంద్ర జడేజా, ధ్రువ్ షోరే, చైతన్య బిష్ణోయ్, రితురాజ్ గైక్వాడ్, డ్వాన్ బ్రేవో, కర్ణ్ శర్మ, ఇమ్రాన్ తాహీర్, హర్భజన్ సింగ్, మిచెల్ సాంత్నార్, శార్దుల్ థాకూర్, మోహిత్ శర్మ, కేఎం అసిఫ్, డేవిడ్ విల్లే, దీపక్ చాహర్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్)
రాయల్ ఛాలెంజర్ స బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిల్లియర్స్, పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), మార్కస్ స్టొయనిస్, శిమ్రాన్ హెట్‌మెయర్, శివం దుబే, నాథన్ కౌల్టర్-నైల్, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్‌యాదవ్, యుజువేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మొయన్ అలీ, కొలిన్ డీగ్రాండ్‌హోం, పవన్ నేగి, టిమ్ సౌథీ, ఆకాశ్ దీప్‌నాథ్, మిలింద్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, గురుకీరత్ సింగ్, ప్రయాస్ రే బర్మన్, కుల్వంత్ కేజ్రోలియా, నవదీప్ సైనీ, హిమ్మత్ సింగ్,

ధోనీ 15.. విరాట్ 7..

గత ఐపీఎల్ సీజన్లలో ఈ రెండు జట్లు 23 సార్లు తలపడ్డాయ. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 సార్లు విజయం సాధించగా, చెన్నై సూపర్ కింగ్స్ 15 సార్లు విజయం సాధించింది. అయతే చెన్నై సాధించిన విజయాల్లో సొంత మైదానంలో 6 గెలవగా, బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచుల్లో 4 సార్లు గెలుపొందింది. తటస్థంగా జరిగిన వేదికల్లో 5 సార్లు జయభేరి మోగించింది. విరాట్ సేన మాత్రం హోం గ్రౌండ్‌లో మూడు సార్లు విజయం సాధించగా, చెన్నైలో ఒకసారి, తటస్థంగా జరిగిన వేదికల్లో మరో మూడు సార్లు గెలిచింది.