క్రీడాభూమి

చెన్నై బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 23: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ చేసింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌ని ఏడు వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది. హర్భజన్ సింగ్ మూడు, ఇమ్రాన్ తాహిర్ మూడు చొప్పున వికెట్లు కూల్చి, బెంగళూరును దారుణంగా దెబ్బతీశారు. ఫలితంగా 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. అనంతరం లక్ష్యాన్ని చెన్నై మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని ఈ జట్టు టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీసహా బ్యాట్స్‌మెన్ అంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఓపెనర్‌గా వచ్చిన పార్థీవ్ పటేల్ (29) తప్ప మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం బెంగళూరు వైఫల్యాలకు అద్దం పడుతుంది. హర్భజన్ 4 ఓవర్లు బౌల్ చేసి, 20 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఇమ్రాన్ తాహిర్ తొమ్మిది పరుగులకే మూడు వికెట్లు సాధించాడు. రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. డ్వేయిన్ బ్రేవో ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, 71 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఎనిమిది వికెట్ల వద్ద తొలి వికెట్‌ను షేన్ వాట్నస్ (0) రూపంలో కోల్పోయింది. అనంతరం అంబటి రాయుడు, సురేష్ రైనా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జట్టు స్కోరు 409 పరుగుల వద్ద రైనా (18) ఔట్‌కాగా, రాయుడు 42 బంతుల్లో 28 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అనంతరం కేదార్ జాధవ్ (13 నాటౌట్), రవీంద్ర జడేజా (6 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, 17.4 ఓవర్లలో జట్టును లక్ష్యానికి చేర్చారు.
స్కోర్ బోర్డు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: విరాట్ కోహ్లీ (సీ) రవీంద్ర జడేజా (బీ) హర్భజన్ 6, పార్థీవ్ పటేల్ (సీ) కేదార్ జాదవ్ (బీ) డీజే బ్రేవో 29, మొయన్ అలీ (సీబీ) హర్భజన్ 9, ఏబీ డివిల్లియర్స్ (సీ) రవీంద్ర జడేజా (బీ) హర్భజన్ 9, షిమ్రా న్ హెట్‌మెయర్ (రనౌట్) 0, శివమ్ దుబే (సీ) వాట్సన్ (బీ) తాహీర్ 2, కొలిన్ డీగ్రాండ్‌హోం (సీ) ధోనీ (బీ) రవీంద్ర జడే జా 4, నవదీప్ సైనీ (సీ) వాట్సన్ (బీ) తాహీర్ 2, యుజువేంద్ర చాహల్ (సీ) హర్భజన్ (బీ) తాహీర్ 4, ఉమేశ్ యాదవ్ (బీ) రవీంద్ర జడేజా 1, మహమ్మద్ సిరాజ్ (నాటౌట్) 0.
ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 70 (17.1 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-16, 2-28, 3-38, 4-39, 5-45, 6-50, 7-53, 8-59, 9-70, 10-70.
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-17-0, హర్భజన్ సింగ్ 4-0-20-3, సురేశ్ రైనా 1-0-6-0, ఇమ్రాన్ తాహీర్ 4-1-9-3, రవీంద్ర జడేజా 4-1-15-2, డ్వేన్ బ్రేవో 0.1-0-0-1.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: షేన్ వాట్సన్ (బీ) చాహల్ 0, అంబటి రాయుడు (బీ) సిరాజ్ 28, సురేశ్ రైనా (సీ) శివమ్ దుబే (బీ) మొయన్ 19, కేదార్ జాదవ్ (నాటౌట్) 13, రవీంద్ర జడేజా (నాటౌట్) 6.
ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 71 (17.4 ఓవర్లలో)
వికెట్ల పతనం: 1-8, 2-40, 3-
బౌలింగ్: యుజువేంద్ర చాహల్ 4-1-6-1, నవదీప్ సైనీ 4-0-24-0, మొయన్ అలీ 4-0-19-1, ఉమేశ్ యాదవ్ 3-0-13-0, మహమ్మద్ సిరాజ్ 2-1-5-1, శివమ్ దుబే 0.4-0-3-0.
చిత్రాలు.. కోహ్లీ నిరాశ
*హర్భజన్ సింగ్ 4-0-20-3
*ఇమ్రాన్ తాహీర్ 4-1-9-3