క్రీడాభూమి

లైంగికంగా వేధించేవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సోనా చౌదరి తన కాలంలో మహిళా ఆటగాళ్లను అధికారులు ఎలా లైంగిక వేధింపులకు గురి చేసే వారో తన తాజా పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారు. సోనా చౌదరి 1995నుంచి 1998 మధ్య కాలంలో భారత మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ‘గేమ్ ఇన్ గేమ్’ పేరుతో హిందీలో రాసిన పుస్తకంలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. తనకు ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు కానప్పటికీ చాలా మంది వేధింపులకు గురి కావడాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు ఆమె చెప్పుకొన్నారు. అనాథాశ్రమంనుంచి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారణి స్థాయికి ఎదిగిన తన పుస్తకంలోని ప్రధాన పాత్రధారి మాన్విసింగ్ ద్వారా సోనా చౌదరి ఈ చేదు సంఘటనల గురించి వివరించారు. అయితే ఆమె ఆ పుస్తకంలో అసలు పేర్లకు బదులు మారుపేర్లు వాడడం గమనార్హం. ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూ తాను వారి పేర్లను మార్చినట్లు ఆమె చెప్పుకొన్నారు.
పుస్తకం ప్రారంభంలో అధికారుల చేతుల్లో తోటి క్రీడాకారిణులు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఓ జూనియర్ క్రీడాకారిణి చెప్పిన కథనాన్ని వివరించారు. అంతేకాదు 1989లో మహారాష్టల్రో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్స్ సందర్భంగా అధికారులు మాత్రం షడ్రసోపేతమైన భోజనాలను ఆరగిస్తే ఆటగాళ్లు మాత్రం ఎలా నాసిరకం భోజనం తినాల్సి వచ్చిందో ఆమె వివరించారు. ఉత్తరప్రదేశ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న మాన్వి అనే క్రీడాకారిణి దీనిపై నిరసన తెలిపిన తర్వాత ఆటగాళ్లకు మంచి భోజనం లభించిందని కూడా ఆమె తెలిపారు. అలాగే ఎలాంటి అర్హతా లేని ఓ అమ్మాయిని జాతీయ జట్టులోకి తీసుకు రావడానికి ఒక జట్టు మేనేజర్ ఎలా ప్రయత్నించాడో కూడా ఆమె తన పుస్తకంలో వివరించింది. ఇలాంటి సంఘటనలెన్నో ఆ పుస్తకంలో ఉన్నాయి.
మహిళా ఫుట్‌బాల్ జట్టు
మాజీ కెప్టెన్ సోనా చౌదరి