క్రీడాభూమి

‘ఆ అర్హతలు నాకు లేవు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 13: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కావలసిన అర్హతా ప్రమాణాలు తనకు లేవని టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సిఎబి) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం స్పష్టం చేశాడు. మంగళవారం బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ గురువారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. దీంతో బిసిసిఐ అధ్యక్ష పదవిని భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పదవికి పోటీచేసే అభ్యర్థులు కనీసం మూడుసార్లు బిసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశాలకు హాజరై ఉండాలన్న నిబంధన ఉంది. సిఎబి అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరణించడంతో గత ఏడాది అక్టోబర్ 15వ తేదీన లాంఛనంగా ఆ పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సిఎబి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి కేవలం 6-7 నెలలు మాత్రమే అవుతున్నందున బిసిసిఐ అధ్యక్ష పదవికి పోటీచేసే అర్హతా ప్రమాణాలు తనకు ఉన్నాయని భావించడం లేదని గంగూలీ అన్నాడు. కోల్‌కతాలోని పార్క్‌స్ట్రీట్‌లో శుక్రవారం బంధన్ బ్యాంకు శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ గంగూలీ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అయితే శశాంక్ మనోహర్ స్థానంలో బిసిసిఐ అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టే అవకాశం ఉందని ప్రశ్నించగా, సమాధానం చెప్పడం చాలా కష్టమని, బిసిసిఐ అధ్యక్ష పదవిని చేపట్టదగ్గ అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారని, తాను మాత్రం పదవి గురించి ఆలోచించడం లేదని గంగూలీ చెప్పాడు.