క్రీడాభూమి

థామస్ కప్ టోర్నీకి సాత్విక్ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, మే 13: ప్రతిష్ఠాత్మకమైన థామస్ కప్ బాడ్మింటన్ టోర్నీకి తూర్పు గోదావరి జిల్లా అమలాపురం క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఎంపికయ్యాడు. రాష్ట్ర విభజన అనంతరం అంతర్జాతీయ బాడ్మింటన్ పోటీలకు రాష్ట్రం నుండి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడుగా సాత్విక్ రికార్డులకెక్కాడు. సాత్విక్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 15 నుండి 22వ తేదీ వరకు చైనాలోని జియాంగ్‌షూ నగరం కున్‌షాన్ స్పోర్ట్స్ సెంటర్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. సాత్విక్ ప్రస్తుతం అమలాపురం జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన సాత్విక్‌ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శుక్రవారం అభినందించారు.

పోటీల్లో విజయం సాధించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని వారు ఆకాక్షించారు. అలాగే ఇండియన్ బాడ్మింటన్ అసోసియేషన్ ఈవెంట్స్ కార్యదర్శి కెసిహెచ్ పున్నయ్య చౌదరి, ఆంధ్రా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ రఘుకిరణ్, ఉపాధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి తదితరులు సాత్విక్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

సాత్విక్ సాయరాజ్‌ను అభినందిస్తున్న
ఏపి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప