క్రీడాభూమి

ఐసిసి క్రికెట్ కమిటీ చైర్మన్ పగ్గాలు మళ్లీ కుంబ్లేకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 13: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) క్రికెట్ కమిటీ చైర్మన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తిరిగి నియమితుడయ్యాడు. శుక్రవారం అతడిని రెండోసారి ఈ పదవిలో నియమించారు. అలాగే కుంబ్లే సహచరుడు, భారత జట్టు మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌ను ఈ కమిటీలో సభ్యుడిగా నియమించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా చరిత్రకెక్కిన కుంబ్లే 2012లో తొలిసారి ఐసిసి క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుంబ్లేని మరోసారి ఈ పదవిలో నియమించడంతో మరో మూడేళ్ల పాటు (2018 వరకు) అతను కొనసాగనున్నాడు. కాగా, ఐసిసి క్రికెట్ కమిటీలో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేని కూడా సభ్యుడిగా నియమించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులతో కూడిన ఈ కమిటీలో ద్రవిడ్, జయవర్ధనేలను కూడా సభ్యులుగా నియమించడంతో దానికి మరింత అనుభవాన్ని జోడించినట్లయింది. 1996 నుంచి 2015 మధ్య కాలంలో 1,161 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ద్రవిడ్, జయవర్ధనే మూడేళ్ల పాటు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జరుగనున్న ఐసిసి వార్షిక సమావేశానికి మూడు వారాల ముందు వీరిద్దరు ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో జరిగే సమావేశంలో తొలిసారి పాల్గొంటారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
కమిటీ స్వరూపం ఇదీ..
చైర్మన్: అనిల్ కుంబ్లే (్భరత జట్టు మాజీ కెప్టెన్). ఎక్స్-అఫిషియో: శశాంక్ మనోహర్ (ఐసిసి చైర్మన్), డేవిడ్ రిచర్డ్‌సన్ (ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్). మాజీ ఆటగాళ్ల ప్రతినిధులు: ఆండ్రూ స్ట్రాస్ (ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్), మహేల జయవర్ధనే (శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్). ప్రస్తుత ఆటగాళ్ల ప్రతినిధులు: రాహుల్ ద్రవిడ్ (్భరత జట్టు మాజీ కెప్టెన్), టిమ్ మే (ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్, ‘్ఫకా’ మాజీ సిఇఓ). ఫుల్ మెంబర్ టీమ్ కోచ్ రిప్రజెంటేటివ్: డారెన్ లీమన్ (ఆస్ట్రేలియా కోచ్). అసోసియేట్ రిప్రజెంటేటివ్: కెవిన్ ఓబ్రియాన్ (ఐర్లాండ్ ఆల్‌రౌండర్). మహిళా క్రికెట్ ప్రతినిధి: క్లార్ కానర్ (ఇంగ్లాండ్ మహిళా జట్టు మాజీ కెప్టెన్). ఫుల్ మెంబర్ రిప్రజెంటేటివ్: డేవిడ్ వైట్ (న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్). మీడియా ప్రతినిధి: రవిశాస్ర్తీ (్భరత జట్టు మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత). అంపైర్ల ప్రతినిధి: రిచర్డ్ కెటిల్‌బరో (ఐసిసి అంపైర్ల ఎమిరేట్స్ ఎలైట్ ప్యానల్ సభ్యుడు). రిఫరీల ప్రతినిధి: రంజన్ మదుగళ్లే (ఐసిసి చీఫ్ మ్యాచ్ రిఫరీ, శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్). ఎంసిసి ప్రతినిధి: జాన్ స్టీఫెన్సన్ (ఎంసిసి క్రికెట్ ప్రధానాధికారి).

టీమిండియాలో సహచరులుగా
అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ (ఫైల్ ఫొటో)