క్రీడాభూమి

ముంబయి ఇండియన్స్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 13: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నీ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలను ఇప్పటికే దాదాపు కోల్పోయిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది. విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరించిన కింగ్స్ ఎలెవెన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ముంబయి ఇండియన్స్ అవకాశాలకు గండి కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు రాబట్టగా, అనంతరం 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు సాధించిన కింగ్స్ ఎలెవెన్ మరో 18 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించింది. ఓపెనర్ మురళీ విజయ్, వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా అర్ధ శతకాలతో రాణించి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు సునాయాస విజయాన్ని అందించారు. ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన కింగ్స్ ఎలెవెన్‌కు ఇది నాలుగో విజయం కాగా, ముంబయి ఇండియన్స్‌కు 12 మ్యాచ్‌లలో ఇది ఆరో ఓటమి.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్లు గడగడలాడించారు. ముఖ్యంగా మార్కస్ స్టోయినిస్ (4/15) నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులపై విరుచుకుపడగా, సందీప్ శర్మ (2/11), మొహిత్ శర్మ 2/26) తమవంతు రాణించారు. వీరి జోరును ప్రతిఘటించలేక ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మన్లు ఉన్ముక్త్ చాంద్ (0), అంబటి రాయుడు (0), జోస్ బట్లర్ (9), టిమ్ సౌథీ (1), మెక్‌క్లెనఘన్ (4) పెవిలియన్‌కు పరుగెత్తారు. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ (15), నితీశ్ రాణా (25), కీరన్ పొలార్డ్ (27), హార్దిక్ పాండ్య (19), హర్భజన్ సింగ్ (14-నాటౌట్) రెండంకెల స్కోర్లు సాధించడంతో ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు సాధించగలిగింది.
అనంతరం 125 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కేవలం ఒక్క పరుగుకే హషీమ్ ఆమ్లా (0) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఓపెనర్ మురళీ విజయ్ (52 బంతుల్లో 54 పరుగులు)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా దిగిన వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా (40 బంతుల్లో 56 పరుగులు) క్రీజ్‌లో నిలదొక్కుకుని ధాటిగా ఆడారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించిన వీరు చూడముచ్చటైన షాట్లతో అలరించి చెరొక అర్ధ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు 116 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత 16వ ఓవర్‌లో మెక్‌క్లెనఘన్ వేసిన బంతులను ఎదుర్కోబోయి సాహాతో పాటు సెంకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0) నిష్క్రమించినప్పటికీ మురళీ విజయ్, గుర్‌కీరత్ సింగ్ (4 బంతుల్లో 6 పరుగులు) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు రాబట్టిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మరో 18 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను మట్టికరిపించింది.

సంక్షిప్తంగా స్కోర్లు
ముంబయ ఇండియన్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 124/9 (రోహిత్ శర్మ 15, నితీశ్ రాణా 25, కీరన్ పొలార్డ్ 27, హార్దిక్ పాండ్య 19, హర్భజన్ సింగ్ 14-నాటౌట్).
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇన్నింగ్స్: 17 ఓవర్లలో 129/5 (మురళీ విజయ్ 54-నాటౌట్, వృద్ధిమాన్ సాహా 56, గుర్‌కీరత్ సింగ్ 6-నాటౌట్).

ఐపిఎల్‌లో నేడు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
గుజరాత్ లయన్స్
బెంగళూరులో సాయంత్రం 4 గంటల నుంచి
కోల్‌కతా నైట్ రైడర్స్
రైజింగ్ పుణె సూపర్ జెయంట్స్
కోల్‌కతాలో రాత్రి 8 గంటల నుంచి

వృద్ధిమాన్ సాహా (56 పరుగులు)