క్రీడాభూమి

ట్రయల్ బౌట్‌పై జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: భారత్ నుంచి ఒలిపింక్స్‌కు రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో ఎవరు పోటీపడాలనే విషయంపై తలెత్తిన వివాదం ముదురుతోంది. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్ బౌట్‌పై జోక్యం చేసుకొని తనకు అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సుశీల్ కుమార్ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్రీడా మంత్రిత్వ శాఖకు కూడా కాపీని పంపిన సుశీల్ తనకు ఒలింపిక్స్‌లో అవకాశం దక్కేలా చూడాలని కోడాడు. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్ బౌట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో పతకం గెల్చుకున్న తర్వాత సుశీల్ పలు టోర్నీల్లో పాల్గొనలేదు. వివిధ కారణాలను పేర్కొంటూ అతను పోటీలకు గైర్హాజరవుతూ వచ్చాడు. అదే సమయంలో నర్సింగ్ యాదవ్ అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరచి, గట్టిపోటీదారుగా మారాడు. 74 కిలోల విభాగంలో పోటీపడే అవకాశం ఒకరికే ఉండడంతో, రెండు పర్యాయాలు ఒలింపిక్ పతకాలను సాధించిన ఏకైక భారతీయుడిగా రికార్డు నెలకొల్పిన తనకే అవకాశం ఇవ్వాలని సుశీల్ వాదిస్తున్నాడు. అయితే, సుశీల్ చాలా టోర్నీలకు డుమ్మా కొట్టాడని, అతను లేని సమయంలో నర్సింగ్ దేశ ప్రతిష్టను నిలబెట్టాడని పలువురు క్రీడా ప్రముఖులు గుర్తుచేస్తున్నారు. గతాన్ని దృష్టిలో ఉంచుకొని సుశీల్‌ను ఎంపిక చేయడం కంటే, నర్సింగ్‌కు అవకాశం ఇవ్వడం మంచిదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తామిద్దరి మధ్య ట్రయల్ పోటీని నిర్వహించి, విజేతను రియోకు పంపాలని సుశీల్ సూచిస్తున్నాడు. తన ప్రతిపాదనకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) నుంచి ఇంకా స్పందన రాకపోవడంతో నేరుగా ప్రధానికి, క్రీడా మంత్రిత్వ శాఖకు లేఖలు రాశాడు.
కోర్టుకు వెళ్లే ఆలోచన
తనకు రియో వెళ్లే అవకాశం లభించేందుకు నర్సింగ్‌తో ట్రయల్ బౌట్‌ను నిర్వహించకపోతే కోర్టును ఆశ్రయించాలని సుశీల్ కుమార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. డబ్ల్యుఎఫ్‌ఐ నుంచి స్పందన కోసం తాము ఎదురుచూస్తున్నామని, అనివార్యమనుకుంటే కోర్టును ఆశ్రయిస్తామని సుశీల్ మెంటర్ సత్పాల్ సింగ్ తెలిపాడు.
మంగళవారం సమావేశం
ఇలావుంటే, సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్‌లలో ఎవరిని రియో ఒలింపిక్స్‌కు పంపాలనే విషయంపై డబ్ల్యుఎఫ్‌ఐ మంగళ వారం సమావేశం కానుంది. నర్సింగ్‌తో ట్రయల్ బౌట్ కోసం సుశీల్ చేస్తున్న డిమాండ్‌ను పరిశీలిస్తుంది.