క్రీడాభూమి

టైటిల్‌పై సైనా బృందం కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కున్షాన్ (చైనా), మే 14: సైనా నెహ్వాల్ బృందం ఆదివారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న ఉబేర్ కప్ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌పై కనే్నసింది. అయితే, పురుషుల విభాగంలో థామస్ కప్ కోసం జరిగే పోరులో భారత్‌కు కష్టాలు తప్పేటట్టు కనిపించడం లేదు. ఉబేర్ కప్‌లో భారత మహిళల జట్టు మొట్టమొదటిసారి 2010లో క్వార్టర్ ఫైనల్ చేరింది. నాలుగేళ్ల తర్వాత, 2014లో న్యూఢిల్లీలో జరిగిన పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరచి, తొలిసారి సెమీ ఫైనల్ చేరింది. అయితే, ఐదు పర్యాయాలు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న జపాన్ చేతిలో 2-3 తేడాతో ఓడింది. నిబంధనలను అనుసరించి సెమీస్‌లో ఓటమిపాలైన భారత్‌కు కాంస్య పతకం దక్కింది. కాగా, ఈసారి భారత్ 2014లో రన్నరప్‌గా నిలిచిన జపాన్‌తోపాటు ఆస్ట్రేలియా, జర్మనీ కూడా ఉన్న గ్రూపు నుంచి రౌండ్ రాబిన్ మ్యాచ్‌ల్లో పోటీపడుతుంది. సైనా, పివి సింధు రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఆడతారు. మూడో సింగిల్స్‌ను ఆడే అవకాశం కోసం శివానీ గద్దె, తన్వీలాడ్, పిసి తులసీ పోటీపడుతున్నారు. ఈ టోర్నీలో మూడు సింగిల్స్‌తోపాటు రెండు డబుల్స్ మ్యాచ్‌లు ఉంటాయి. ఒక డబుల్స్ మ్యాచ్‌లో జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప బరిలోకి దిగుతారు. మరో డబుల్స్ మ్యాచ్‌ని సిక్కీ రెడ్డి, మనీష జంటగా ఆడతారు.
థామస్ కప్‌లో అజయ్ జయరామ్ జట్టును ముందుకు నడిపించే బాధ్యతను స్వీకరించనున్నాడు. ప్రపంచ 12వ ర్యాంక్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకోగా, హెచ్‌ఎస్ ప్రణయ్ కాలి గాయంతో దూరమయ్యాడు. ఫలితంగా జయరామ్, సాయి ప్రణీత్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ భారత పోరాటాన్ని ముందుకు తీసుకెళతారు. డబుల్స్ విభాగంలో మను అత్రి, సుమీత్ రెడ్డి బరిలోకి దిగడం ఖాయం. రెండో డబుల్స్ మ్యాచ్‌లో ఆడే అవకాశం అక్షయ్ దివాల్కర్/ సాత్విన్ రాయ్ రాజ్/ చిరాగ్ శెట్టిలలో ఇద్దరికి లభిస్తుంది.