క్రీడాభూమి

విరాట్ కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, ఏప్రిల్ 14: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ మ్యాచ్ రిఫరీ జరిమానా విధించింది. కింగ్స్ ఎలె వన్ పంజాబ్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించింది. అంతకుముందు ఇదే సీజ న్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ అంజిక్యా రహానెకు స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షలు జరిమానా విధించగా, చెన్నై సూపర్ కిం గ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అంపైర్లతో వాగ్వాదానికి గానూ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో ఏడో మ్యాచ్‌లో గెలిచి బోణి చేసింది.