క్రీడాభూమి

కోహ్లీసేన ‘రికార్డు’ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 14: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో చెలరేగిపోయింది. కోహ్లీ, ఎబి డివిలియర్స్ సిక్సర్లతో హోరెత్తించారు. ఐపిఎల్ చరిత్రలోనే మొదటిసారి ఒక ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు నమోదుకాగా, బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 248 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన గుజరాత్ 104 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు 144 పరుగుల ఆధిక్యంతో విజయభేరి మోగించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ సురేష్ రైనా ఫీల్డింగ్‌ను ఎంచుకొని, మూల్యాన్ని చెల్లించుకున్నాడు. స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (6)ను ధవళ్ కులకర్ణి క్లీన్ బౌల్డ్ చేసి, 19 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్ సాధించామన్న ఆనందం గుజరాత్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. ఓపెనర్ కోహ్లీతో కలిసిన ఫస్ట్‌డౌన్ ఆటగాడు ఎబి డివిలియర్స్ ఆట తీరును మార్చేశాడు. అతని సుడిగాలి బ్యాటింగ్ ముందుకు విలవిల్లాడిన గుజరాత్ బౌలర్లు ప్రేక్షకపాత్ర పోషించాల్సి వచ్చింది. 43 బంతుల్లోనే అతను శతకాన్ని పూర్తి చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 96 బంతుల్లో 229 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 55 బంతులు ఎదుర్కొని, 5 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 109 పరుగులు సాధించిన కోహ్లీ ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఐదో బంతికి అవుటయ్యాడు. ప్రవీణ్ కుమార్ వేసిన ఈ ఓవర్‌లో అతను డ్వెయిన్ బ్రేవోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆతర్వాతి బంతికే షేన్ వాట్సన్ వికెట్ కూడా కూలింది. అతను తాను ఎదుర్కొన్న తొలి బంతిలోనే వికెట్‌కీపర్ దినేష్ కీర్తిక్‌కు దొరికిపోయాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి బెంగళూరు మూడు వికెట్లు కోల్పోయి 248 పరుగులు సాధించింది. ఐపిఎల్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. అప్పటికి డివిలియర్స్ 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 52 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 10 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి.
చేతులెత్తేసిన గుజరాత్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమన్న రీతిలో ఇన్నింగ్స్ ఆరంభంలోనే గుజరాత్ చేతులెత్తేసింది. తొమ్మిది పరుగుల స్కోరువద్ద డ్వెయిన్ స్మిత్ (7) వికెట్‌ను కోల్పోయిన ఆ జట్టు తర్వాత కోలుకోలేకపోయింది. వికెట్లు ఒకదాని తర్వాత మరొకటిగా కూలగా, ఆరోన్ ఫించ్ కొంత సేపు ఒంటరి పోరాటం చేసి, 38 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా 19 బంతుల్లో 21, కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ 13 బంతుల్లో 11 పరుగులకు అవుటయ్యారు. ఈ ముగ్గురిని మినహాయిస్తే గుజరాత్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోర్లు చేయలేకపోయారు. ఫలితంగా ఆ జట్టు 18.4 ఓవర్లలో, మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే, 104 పరుగులకు కుప్పకూలింది. క్రిస్ జోర్డాన్ మూడు ఓవర్లు బౌలర్ చేసి, కేవలం 11 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను చావుదెబ్బ తీశాడు. యజువేంద్ర చాహల్ 19 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడి, 129 పరుగులతో అజేయంగా నిలిచిన డివిలియర్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
స్వేచ్ఛగా ఆడాను: డివిలియర్స్
వికెట్ కూలుతుందన్న భయం లేకుండా చాలా స్వేచ్ఛగా ఆడానని, అందుకే సెంచరీ చేయగలి గానని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన డివిలియర్స్ అన్నాడు. విరాట్ కోహ్లీ సహాయ సహకారాలు లేకపోతే, తనకు ఈ ఇన్నింగ్స్ సాధ్యమయ్యేది కాదని అన్నాడు. ఒత్తిడి లేకుండా మ్యాచ్‌ని ఆడా మని, అదే తమ విజయానికి కారణమని డివిలియర్స్ అన్నాడు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ అన్నీ తాము అనుకున్న విధంగానే జరిగాయని అన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభా గాల్లో తన అంచనాలు సత్ఫలితాలను ఇచ్చాయని అన్నాడు. భారీ స్కోరు సాధించడం సంతృప్తికరంగా ఉందని అన్నాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే ప్రధానమని పేర్కొన్నాడు. ఓటమిపాలైన గుజరాత్ లయన్స్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ మాట్లాడుతూ ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్ చెలరేగితే ఫలి తం ఎలా ఉంటుందో ఈ మ్యాచ్‌తో స్పష్టమైందంటూ కోహ్లీ, డివిలియర్స్‌ను ప్రశంసించా డు. ఓటమి నిరాశ పరచినప్పటికీ, ఒక బలమైన జట్టు చేతిలో ఓడా మన్నది వాస్తవమని వ్యాఖ్యానించాడు.

సంక్షిప్త స్కోర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో 3 వికెట్లకు 248 (విరాట్ కోహ్లీ 109, ఎబి డివిలియర్స్ 129 నాటౌట్, ప్రవీణ్ కుమార్ 2/45).
గుజరాత్ లయన్స్: 18.4 ఓవర్లలో 104 ఆలౌట్ (ఆరోన్ ఫించ్ 37, రవీంద్ర జడేజా 21, బ్రెండన్ మెక్‌కలమ్ 11, క్రిస్ జోర్డాన్ 4/11, యజువేంద్ర చాహల్ 3/19).
---

ఐపిఎల్‌లో
భారీ స్కోర్లుఐపిఎల్ చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం 3 వికెట్లకు 248 పరుగులు సాధించి, రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఇదే జట్టు 2013 ఏప్రిల్ 23న పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసి రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డును అధిగమించలేకపోయినా, ఐపిఎల్‌లో రెండో అత్యధిక స్కోరును శనివారం సాధించింది.
--
ఐపిఎల్‌లో 210 లేదా అంతకు మించిన స్కోర్లు
1. రాజస్తాన్ రాయల్స్ (211/4, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 2009 మే 5న, దర్బన్‌లో), 2. రాజస్తాన్ రాయల్స్ (211/5, చెన్నై సూపర్ కింగ్స్‌పై 2008 మే 24న చెన్నైలో), 3. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (211/4, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 2014 మే 14న హైదరాబాద్‌లో), 4. ముంబయి ఇండియన్స్ (212/6, రాజస్తాన్ రాయల్స్‌పై 2010 మార్చి 13న ముంబయిపై), 5. దక్కన్ చార్జర్స్ (214/5, రాజస్తాన్ రాయల్స్‌పై 2008 ఏప్రిల్ 24న హైదరాబాద్‌లో), 6. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (215/1, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 2012 మే 17న ఢిల్లీలో), 7. రాజస్తాన్ రాయల్స్ (217/7, దక్కన్ చార్జర్స్‌పై 2008 ఏప్రిల్ 24న హైదరాబాద్‌లో), 8. ముంబయి ఇండియన్స్ (218/7, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 2010 మార్చి 17న ఢిల్లీలో), 9. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (221/3, రాజస్తాన్ రాయల్స్‌పై 2008 మే 28న మొహాలీలో), 10. చెన్నై సూపర్ కింగ్స్ (222/5, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 2012 మే 25న చెన్నైలో), 11. కోల్‌కతా నైట్‌రైడర్స్ (222/3, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 2008 ఏప్రిల్ 18న బెంగళూరులో), 12. చెన్నై సూపర్ కింగ్స్ (223/3, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 2013 మే 8న హైదరాబాద్‌లో), 13. రాజస్తాన్ రాయల్స్ (223/5, చెన్నై సూపర్ కింగ్స్‌పై 2010 ఏప్రిల్ 3న చెన్నైలో), 14. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (226/3, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 2015 మే 6న బెంగళూరులో), 15. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (226/6, చెన్నై సూపర్‌కింగ్స్‌పై 2014మే 30న ముంబయిలో), 16. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (227/4, సన్‌రైజర్స్‌పై 2016 ఏప్రిల్ 12న బెంగళూరులో), 17. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (231/4, చెన్నై సూపర్ కింగ్స్‌పై 2014 మే 7న కటక్‌లో), 18. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (231/4, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 2011 ఏప్రిల్ 23న ఢిల్లీలో), 19. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (232/2, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 2011 మే 17న ధర్మశాలలో), 20. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (235/1, ముంబయి ఇండియన్స్‌పై 2015 మే 10న ముంబయిలో), 21. చెన్నై సూపర్ కింగ్స్ (240/5, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 2008 ఏప్రిల్ 19న మొహాలీలో), 22. చెన్నై సూపర్ కింగ్స్ (246/5, రాజస్తాన్ రాయల్స్‌పై 2010 ఏప్రిల్ 3న చెన్నైలో), 23. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (248/3, గుజరాత్ లయన్స్‌పై 2016 మే 14న బెంగళూరులో), 24. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (263/5, పుణె వారియర్స్‌పై 2013 ఏప్రిల్ 23న బెంగళూరులో).
* ఐపిఎల్‌లో టాప్-3 స్కోర్లు బెంగళూరులో నమోదు కావడం విశేషం.
---
ఐపిఎల్‌లో భారీ విజయాలు
(వంద లేదా అంతకు మించిన తేడాతో గెలిచిన జట్లు)
1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (144 పరుగుల తేడాతో గుజరాత్ లయన్స్‌పై/ 2016 మే 14/ బెంగళూరులో), 2. కోల్‌కతా నైట్ రైడర్స్ (140 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై/ 2008 ఏప్రిల్ 18/ బెంగళూరులో), 3. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (138 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై/ 2015 మే 6న బెంగళూరులో), 4. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (130 పరుగుల తేడాతో పుణె వారియర్స్‌పై/ 2013 ఏప్రిల్ 23 బెంగళూరులో), 5. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (111 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై/ 2011 మే 17న ధర్మశాలలో), 6. రాజస్తాన్ రాయల్స్ (105 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై/ 2008 మే 30న ముంబయిలో).
*

* గుజరాత్ లయన్స్ 2489 పరుగుల లక్ష్యాన్ని అందుకొని ఉంటే, ఐపిఎల్ చరిత్రలోనే కొత్త రికార్డు నమోదయ్యేది. కానీ, ఆ జట్టు లక్ష్య సాధనలో విఫ లమైంది. ఫలితంగా రాజస్తాన్ రాయల్స్ (217/7, దక్కన్ చార్జర్స్‌పై 2008లో) పేరిట ఉన్న రికార్డు చెక్కు చెదర లేదు. చేజింగ్ విషయానికి వస్తే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 2014లో 4 వికెట్లకు 211 పరుగులు సాధించి గెలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 2012లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్లకు 208 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 2014లో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించి విజయభేరి మోగించింది. ఈ జాబితాలో ఐదో స్థానం సంపాదించిన 204 పరుగుల లక్ష్య సాధన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉంది. ఈ జట్టు 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై రెండు వికెట్లకు 204 పరుగులు చేసింది.

--
ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత భారీ విజయం శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నమోదైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం గుజరాత్ లయన్స్‌ను 144 పరుగుల తేడాతో ఓడించి ఈ రికార్డును నెలకొల్పింది. బెంగళూరుపై 2008 ఏప్రిల్ 18న కోల్‌కతా నైట్ రైడర్స్ 140 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. అప్పట్లో ఎదురైన పరాభవానికి ఈ విజయం ద్వారా ఊరట లభించింది. డివిలియర్స్, కోహ్లీ శతకాలతో రాణించి, బెంగళూరుకు భారీ స్కోరును అందించగా, క్రిస్ మోరిస్, చాహల్ అద్భుత బౌలింగ్‌తో గుజరాత్‌ను దెబ్బతీశారు.

---

ఐపిఎల్‌లో నేడు
సన్‌రైజర్స్ హైదరాబాద్
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
మొహాలీలో సాయంత్రం 4 గంటల నుంచి
ముంబయ ఇండియన్స్
ఢిల్లీ డేర్‌డెవిల్స్
విశాఖపట్నంలో రాత్రి 8 గంటల నుంచి

chitram నాలుగు వికెట్లు పడగొట్టిన క్రిస్ జోర్డాన్