క్రీడాభూమి

పంత్‌ను తీసుకోలేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: వరల్డ్ కప్ టూర్‌కు బీసీసీఐ ప్రకటించిన 15 మంది గల టీమిండియా జట్టులో యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు చోటు దక్కకపోవడం పట్ల ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తుది జట్టులో 21 ఏళ్ల వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానే దినేష్ కార్తీక్‌ను టీమిండియా రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసిన నేపథ్యంలో ఎంపిక తీర్పు పట్ల ఆశ్చర్యం కనబరిచాడు. 11 మంది జట్టులో పంత్‌ను తీసుకుని ఉంటే ఎంతో కీలకంగా మారేవాడని అభిప్రాయపడ్డాడు. ‘రిషబ్ పంత్‌ను టీమిండియా తుది జట్టులోకి తీసుకోకపోవడాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఒకవేళ అతనిని తీసుకుని ఉంటే ఎంతో కీలకం అయ్యుండేవాడు. జట్టులో నాలుగు, ఐదో స్థానంలో అతనికి చోటు దక్కితే భారత్‌కు మేలు జరిగేది. ఇదే టీమిండియాకు, మిగిలిన జట్లకు ఉన్న తేడా’ అని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ‘వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం బలమైన నమ్మకంతో ఉండేవాడు. కానీ తుది జట్టులో చోటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యాడు. అయినా అతను మూడు, నాలుగు వరల్డ్ కప్‌లలో ఆడేందుకు చోటు దక్కించుకుంటాడు’ అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.