క్రీడాభూమి

ఐదో ఫాస్టెస్ట్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఐపిఎల్‌లో ఐదో వేగవంతమైన శతకాన్ని ఎబి డివిలియర్స్ నమోదు చేశాడు. అతను ఈ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని, 43 బంతుల్లోనే శతకాన్ని సాధించాడు. క్రిస్ గేల్ 30 బంతుల్లోనే చేసిన సెంచరీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. యూసుఫ్ పఠాన్ 37, డేవిడ్ మిల్లర్ 38, ఆడం గిల్‌క్రిస్ట్ 42 బంతుల్లో సెంచరీలు చేశారు.
కోహ్లీ, డివిలియర్స్ ఈ ఐపిఎల్ సీజన్‌లో సెంచరీ భాగస్వా మ్యాన్ని అందించడం ఇది నాలుగోసారి. 2008లో శిఖర్ ధావన్, గౌతం గంభీర్, 2012లో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ మూడేసి సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్‌ను సాధించారు. ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీ పార్ట్‌నర్ షిప్ రికార్డును కోహ్లీ, డివిలియర్స్ ఈ మ్యాచ్‌లో అధిగమించారు. కాగా, ఈ సీజన్‌లో డివిలియ ర్స్ యాభై లేదా అంతకు మించి పరుగులు చేయడం ఇది ఐదో సారి. మరో బ్యాట్స్‌మన్ ఎవరూ ఈ సీజన్‌లో ఈ ఫీట్‌ను సాధించలేకపోయారు.

chitram 12సిక్సర్లుతో అజేయంగా 129 పరుగులు చేసిన డివిలియర్స్