క్రీడాభూమి

రాయుడు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఇంగ్లాండ్‌లో మే 30 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ టూర్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో తనకు చోటు దక్కనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడుపై ఎలాంటి తీసుకునే చర్యలు తీసుకునే ఆస్కారం లేదని బీసీసీఐకి చెందిన ఒక అధికారి తెలిపాడు. వరల్డ్ కప్ మెగా ఈవెంట్‌ను తనను ఎంపిక చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ రాయుడు మంగళవారంనాడు ‘మే 30న ప్రారంభమయ్యే వరల్డ్ కప్‌లో భారత్ ఆటను చూసేందుకు త్రీడీ గ్లాసుల కోసం ఆర్డర్ ఇచ్చాను’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌లోని మూడు సుగుణాలను చూశాకే తుది జట్టులోకి తీసుకున్నామని, అందువల్లే రాయుడుని తప్పించామని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా, తన ఎంపికలో జరిగిన వివక్షపై రాయుడు చేసిన వ్యాఖ్యలు ఎంపిక కమిటీ విధానాలను ఉద్దేశించి కానందున, ఈ వ్యాఖ్యలను తాము అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని అంటూనే బీసీసీఐ స్పష్టం చేసింది. ‘రాయుడు ట్విట్టర్ వేదిక చేసిన వ్యాఖ్యలను పరిశీలించాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తనను ఎంపిక చేయకపోవడంలోని ఆంతర్యాన్ని అసంతృప్తిగా వ్యక్తం చేయడాన్ని అంగీకరించాల్సిందే’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు బుధవారం పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నాడు. ‘రాయుడు అసంతృప్తికి గల కారణాలు అర్ధం చేసుకోదగ్గవే. అయినా అతనిని తాజాగా టీమిండియాలో స్టాండ్‌బైగా ఎంపిక చేశాం. జట్టులో ఎవరైనా గాయపడితే వచ్చే చాన్స్‌ను వినియోగించుకోవచ్చు’ అని ఆ అధికారి పేర్కొన్నాడు.