క్రీడాభూమి

విండీస్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రూసో మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఏప్రిల్ 18: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) మాజీ చీఫ్ పాట్రిక్ రూసో మృతి చెందాడు. 1996-2001 మధ్యకాలంలో బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించిన అతను తన 85వ ఏట, అనారోగ్యంతో మరణించాడు. అతని హయాంలోనే, 2007లో వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌కు విండీస్ ఆతిథ్యమిచ్చింది. రూసో మృతి పట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సంతాపం వ్యక్తం చేసింది. రూసో మృతి కేవలం విండీస్‌కు మాత్రమేగాక, యావత్ క్రికెట్ ప్రపంచానికి కూడా లోటని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనూ సానే ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. క్రికెట్ రంగానికి రూసో చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడాడు. విండీస్ క్రికెట్ బోర్డు కూడా రూసో మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.