క్రీడాభూమి

లోపాలు సరిదిద్దుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: గత మ్యాచ్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, అందులో దొర్లిన లోపాలను సవరించుకుంటామని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై మరోసారి టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు అంటున్నారు. అయితే, గ్రూప్ మ్యాచ్‌ల్లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో చెన్నై ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని కంగుతిన్నది. రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వెన్నునొప్పి కారణంగా బరిలోకి దిగకపోవడంతో, స్టాండ్‌బై సురేష్ రైనా నేతృత్వంలో పోటీపడిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ 29 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్ల సాయంతో 31 పరుగులు చేయగా, ఫఫ్ డు ప్లెసిస్ 31 బంతుల్లో, మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 45 పరుగులు సాధించాడు. తెలుగు తేజం అంబటి రాయుడు 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 17 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు. ఖలీద్ అహ్మద్, షాబాజ్ నదీం, విజయ్ శంకర్ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో చక్కటి ఆరంభాన్ని అందించడమేగాక, ఇద్దరూ అర్ధ శతకాలు సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వార్నర్ 25 బంతుల్లో 50 పరుగులు చేయగా, 44 బంతులు ఎదుర్కొన్న బెయిర్‌స్టో 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం మీద సన్‌రైజర్స్ 16.5 ఓవర్లలో, నాలుగు వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, ఈసారి గ్రూప్ దశలో రెండో పరాజయాన్ని ఎదుర్కొన్న చెన్నై, ఇక మీదట ఎలంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కోచ్ ఫెలింగ్ ఒక ఇంటర్వ్యూలో వివరిస్తూ, మొట్టమొదటిసారి తమకు జట్టులోని కొన్ని లోపాలు కనిపించాయని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లంతా ఎలా స్పందిస్తారన్నది పక్కకుపెడితే, పొరపాట్లు పునరావృతం కాకూడదన్న పట్టుదల అందరిలోనూ ఉంటుందని అన్నాడు. ఈ పరాజయాన్ని భూతద్దంలో చూడడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. బరిలోకి దిగిన తర్వాత విజయాపజయాలు సహజమని, అయితే, లోపాలను గుర్తించి, వాటిని సరి చేసుకుంటే భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించవచ్చని అన్నాడు.
ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించడమే చెన్నై లక్ష్యమని చెప్పాడు. ప్రతి మ్యాచ్‌నీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటామని, అన్ని మ్యాచ్‌లూ తమకు కీలకమేనని ఫ్లెమింగ్ చెప్పాడు. ఇలావుంటే, ఇప్పటి వరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన చెన్నై మొత్తం ఏడు విజయాలు సాధించి, 14 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది.