క్రీడాభూమి

రాహుల్, పాండ్యకు భారీ జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ‘కాఫీ విత్ కరణ్ షో’లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ జరి మానా విధించారు. ఇద్దరు ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున జరిమానా విధించారు. విధుల్లో ప్రా ణాలు కోల్పోయన 10మంది పారా మిలటరీ కానిస్టేబుళ్ల భార్యలకు ఒక్కొక్కరు రూ.1లక్ష చొప్పున ఇ వ్వాలని అంబుడ్స్‌మన్ ఆదేశించారు. అలాగే అంధుల క్రికెట్ సంఘానికి ఇద్దరూ చెరో రూ.10 లక్షలు డిపా జిట్ చేయాలన్నారు. నాలుగు వారా ల్లోగా జరిమానా మొత్తాన్ని చెల్లిం చాలని, లేదంటే ప్లేయర్ల మ్యాచ్ ఫీజు నుంచి బీసీసీఐ ఆ సొమ్మును తీసు కుంటుందని జిస్టీస్ జైన్ తెలిపారు. కాగా, ఈ వివాదంతో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధంతరంగా వెనక్కు రావడంతో సుమారు రూ.30 లక్షల ఆదాయాన్ని కోల్పోయనట్లు అంబు డ్స్‌మన్ తెలిపారు. దేశానికి ఆదర్శం గా నిలవాల్సిన వీరు ఇలాంటి వ్యా ఖ్యలు చేయడం బాధాకరమని, ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు.