క్రీడాభూమి

రాజస్థాన్ గెలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: హమ్మయ్య.. రాజస్థాన్ గెలిచింది. ముంబైపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌గా అజింక్యా రహానే నుంచి బాధ్యతలు తీసుకున్న స్టీవ్ స్మిత్ తొలి మ్యాచ్‌లోనే జట్టును దగ్గరుండి మరీ గెలిపించాడు. శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్థాన్ ముంబైకి బ్యాటింగ్ అప్పగించింది. దీంతో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, క్వాంటన్ డీకాక్ క్రీజులోకి వచ్చారు. అయతే ఎప్పటిలాగే రోహిత్ శర్మ (5) నిరాశ పరిచాడు. శ్రే యాస్ గోపాల్ బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి సూర్య కుమార్‌తో కలిసి డీకాక్ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఈక్రమంలో డీకాక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డీకాక్‌కు ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై రెండో అర్ధ సెంచరీ కాగా, ఓవరాల్‌గా తొమ్మిదవది. మరోవైపు సూర్యకుమార్ కూడా అచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచే బాధ్యత తీసు కున్నాడు. ఈ దశలో సూర్యకుమార్ (34)ను బిన్నీ అవుట్ చేయడంతో 108 పరుగులకే ముంబై రెండో వికెట్‌ను కోల్పో యంది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. గత మ్యాచ్‌లో ముంబైని గెలిపించిన హార్దిక్ పాండ్య మూడో బ్యాట్ సమన్‌గా క్రీజులోకి రాగా, డీకాక్ (65) శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన కీరన్ పొలార్డ్ (10), హార్దిక్ పాండ్య (23) కూడా వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. అంతకుముందు పాండ్య రెండు సా ర్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించు కున్న రాణించలేకపోయాడు. దీంతో క్రీజులోకి వచ్చిన బెన్ కట్టింగ్ (13 నాటౌట్), కృనాల్ పాండ్య (2, నాటౌట్) చివర వరకు క్రీజులో నిలవడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ 161 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్‌కు రెండు, స్టువర్ట్ బిన్నీ, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కత్‌కి తలా ఒక వికెట్ దక్కింది.
మళ్లీ నిరాశ పరిచిన రహానే..
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నాలుగో ఓవర్‌లోనే అజింక్యా రహానే (12) వికెట్‌ను కోల్పోయంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్ సంజూ శాంసన్ ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. శాంసన్ (35) మంచి ఫాంలో ఉండగా, రాహుల్ చాహర్ వేసిన అద్భుత బంతికి పొలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరడంతో రాజస్థాన్ 77 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ స్మిత్‌కు రియాన్ పరాగ్ (43) మంచి సహకారం అందిచడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు కెప్టెన్ స్మిత్ (59, నాటౌట్) అర్ధ సెంచరీ సాధించగా, పరగ్ అనూహ్యాంగా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆస్టాన్ టర్నర్ (0) ను బుమ్రా పెవిలియన్‌కు పంపడంతో గెలుపుకు దగ్గర ఉన్న రాజస్థాన్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో స్టువర్ బిన్నీ (7) సాయంతో కెప్టెన్ స్మిత్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్‌కు 3, జస్ప్రీత్ బుమ్రాకు ఒక వికెట్ లభించింది.
స్కోర్ బోర్డు..
ముంబై బ్యాటింగ్: క్వాంటన్ డీకాక్ (సీ) స్టోక్స్ (బీ) శ్రేయాస్ గోపాల్ 65, రోహిత్ శర్మ (సీబీ) శ్రేయాస్ గోపాల్ 5, సూర్యకూమార్ యాదవ్ (సీ) డీ కులకర్ణి (బీ) బిన్నీ 34, హార్దిక్ పాండ్య ఎల్‌బీడబ్ల్యూ (బీ) జోఫ్రా ఆర్చర్ 23, కీరన్ పొలార్డ్ (బీ) ఉనాద్కత్ 10, బెన్ కట్టింగ్ (నాటౌట్) 13, కృనాల్ పాండ్య (నాటౌట్) 2.
ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 161 (20 ఓవర్లలో 5 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-11, 2-108, 3-111, 4-124, 5-152
బౌలింగ్: స్టువర్ట్ బిన్నీ 3-0-19-1, ధావల్ కులకర్ణి 3-0-31-0, శ్రేయాస్ గోపాల్ 4-0-21-2, జోఫ్రా ఆర్చర్ 4-0-22-1, జయదేవ్ ఉనాద్కత్ 4-0-46-1, రియాన్ పరాగ్ 2-0-17-0.
రాజస్థాన్ బ్యాటింగ్: అజింక్యా రహానే (సీ) సూర్యకుమార్ యాదవ్ (బీ) రాహుల్ 12, సంజూ శాంసన్ (సీ) పొలార్డ్ (బీ) రాహుల్ చాహర్ 35, స్టీవెన్ స్మిత్ (నాటౌట్) 59, బెన్ స్టోక్స్ (బీ) రాహుల్ చాహర్ 0, రియాన్ పరాగ్ రనౌట్ (కట్టింగ్/హార్దిక్ పాండ్య) 43, ఆస్టాన్ టర్నర్ ఎల్‌బీడబ్ల్యూ (బీ) బుమ్రా 0, స్టువర్ట్ బిన్నీ (నాటౌట్) 7.
ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 162 (19.1 ఓవర్లలో 5 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-39, 2-76, 3-77, 4-147, 5-153
బౌలింగ్: హార్దిక్ పాండ్య 4-0-31-0, కృనాల్ పాండ్య 2-0-24-0, లసిత్ మలింగ 3.1-0-27-0, రాహుల్ చాహర్ 4-0-29-3, జస్ప్రీత్ బుమ్రా 4-0-21-1, మయంక్ మార్కండే 2-0-24-0.
చిత్రాలు.. స్టీవ్ స్మిత్ (59, నాటౌట్)
*డీకాక్ (65)