క్రీడాభూమి

వావ్ వార్నర్.. స్టో సూపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్: సొంత గడ్డపై హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు రెచ్చిపోయారు. కొండంత లక్ష్యాన్ని తేలికగా, మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించారు. ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్లు కోల్పోయ 159 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందుంచింది. నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్లు క్రిస్ లీన్, సునీల్ నరైన్ ఆది నుంచే ధాటిగా ఆడారు. ఈ క్రమంలో నరైన్ (25) భారీ షాట్‌కు యత్నించి ఖలీల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికాడు. నరైన్ 8 బంతుల్లోనే 25 పరుగులు చేయగా, అందులో 3 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయ. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ (3) ఎప్పటిలాలగే నిరాశ పరిచాడు. ఖలీల్ బౌలింగ్‌లో విజయ్‌శంకర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో నితీష్ రానా (11), కెప్టెన్ దినేష్ కార్తీక్ (6) విఫలమవడంతో కోల్‌కతా 73 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. మరోవైపు ఓపెనర్ క్రిస్ లీన్ ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచే బాధ్యతను తీసుకున్నాడు. లీన్ జతగా రింకూ సింగ్ కొద్దిసేపు హైదరాబాద్ బౌలర్లను అడ్డుకొని పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత రింకూ (30) సందీప్ శర్మ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ అండ్రూ రస్సేల్ (15) వచ్చి రావడంతోనే రెండు సిక్సర్లు సంధించి మంచి జోరుమీద కనిపించాడు. మరోవైపు అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న క్రిస్ లీన్ (51) ఖలీల్ అహమ్మద్ బౌలింగ్‌లో విలియమ్సన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రస్సేల్ (15), పీయూష్ చావ్లా (4)ను భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేసిన ఆంధ్రా కుర్రోడు యర్రా పృథ్వీరాజ్ (0, నాటౌట్), కేసీ కరియప్పా (9, నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండడంతో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయ 159 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహమ్మద్ 3, భువనేశ్వర్ కుమార్ 2, సందీప్ శర్మ, రషీద్‌ఖాన్‌లు తలో వికెట్ తీసుకున్నారు.
131 పరుగుల భాగస్వామ్యం..
160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో మరింత రె చ్చిపోయంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయర్‌స్టో కోల్‌కతా బౌలర్లను పరుగులు పెట్టించారు. బౌండరీలు, సిక్సర్లతో ప్రేక్షకులకు అసలైన మజా అందించారు. 10వ ఓవర్‌లోనే వీరిద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ (67)ను కొత్త కుర్రోడు యర్రా పృథ్వీరాజ్ బౌల్డ్ చేశాడు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ 131 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం కెప్టెన్ విలియమ్సన్ (8, నాటౌట్)తో కలిసి మరో ఓపెనర్ బెయర్ స్టో (80, నాటౌట్) మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. హైదరాబాద్ బౌలర్లలో పృథ్వీరాజ్‌కు మినహా మరెవరికీ వికెట్ దక్కలేదు.
స్కోర్ బోర్డు..
కోల్‌కతా ఇన్నింగ్స్: క్రిస్ లీన్ (సీ) విలియమ్సన్ (బీ) ఖలీల్ అహమ్మద్ 51, సునీల్ నరైన్ (బీ) ఖలీల్ అహమ్మద్ 25, శుభ్‌మన్ గిల్ (సీ) విజయ్ శంకర్ (బీ) ఖలీల్ అహమ్మద్ 3, నితీష్ రానా (సీ) బెయర్ స్టో (బీ) భువనేశ్వర్ 11, దినేష్ కార్తీక్ రనౌట్ (విజయ్ శంకర్/బెయర్ స్టో) 6, రింకూ సింగ్ (సీ) రషీద్ ఖాన్ (బీ) సందీప్ శర్మ 30, అండ్రూ రస్సేల్ (సీ) రషీద్ ఖాన్ (బీ) భువనేశ్వర్ 15, పీయూష్ చావ్లా (సీ) బెయర్ స్టో (బీ) రషీద్ ఖాన్ 4, యర్రా పృథ్వీరాజ్ (నాటౌట్) 0, కేసీ కరియప్పా (నాటౌట్) 9.
ఎక్స్‌ట్రాలు: 5 మొత్తం: 159 (20 ఓవరల్లో 8 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-42, 2-50, 3-65, 4-73, 5-124, 6-133, 7-146, 8-150.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-35-2, షబ్బాజ్ నదీమ్ 4-0-30-0, ఖలీల్ అహమ్మద్ 4-0-33-3, సందీప్ శర్మ 4-0-37-1, రషీద్ ఖాన్ 4-0-23-1.
హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (బీ) యర్రా పృథ్వీరాజ్ 67, జానీ బెయర్ స్టో (నాటౌట్) 80, కేన్ విలియమ్సన్ (నాటౌట్) 8.
ఎక్స్‌ట్రాలు: 6 మొత్తం: 161 (15 ఓవరల్లో 1 వికెట్ నష్టానికి)
వికెట్ల పతనం: 1-131
బౌలింగ్: హ్యారీ గుమీ 2-0-16-0, యర్రా పృథ్వీరాజ్ 3-0-29-1, పీయూష్ చావ్లా 3-0-38-0, సునీల్ నరైన్ 4-0-34-0, కేసీ కరియప్పా 2-0-34-0, అండ్రూ రస్సేల్ 1-0-8-0.

చిత్రాలు.. అర్ధ సెంచరీలు సాధించిన డేవిడ్ వార్నర్, జానీ బెయర్ స్టో
*మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మహమ్మద్ ఖలీల్ 4-0-33-3