క్రీడాభూమి

స్వదేశానికి వెళ్లనున్న వార్నర్, బెయర్ స్టో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయర్ స్టో మే 30 నుంచి జరిగే ప్రపంచకప్ కోసం స్వదేశానికి వెళ్లనున్నారు. దీంతో వీరిద్దరూ ఈ సీజన్ ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నారు. వార్నర్ ఈ నెల చివరన, బెయస్టో మంగళవారం స్వదేశానికి వెళ లనున్నట్లు ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన వీరు జట్టుకు దూరం కానున్నట్లు చెప్పాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరూ మొదటి రెండు స్థానాల్లో ఉండడం విశేషం. వార్నర్ 73.85 యావరేజ్, 148.56 స్ట్రైక్‌రేట్‌తో 517 పరుగులు చేయగా, బెయర్ స్టో 158.36 స్ట్రైక్‌రేట్‌తో 445 పరుగులు చేశాడు.