క్రీడాభూమి

ఆసీస్ జట్టు సలహాదారుగా శ్రీరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 16: వచ్చే ఏడాది జరిగే ప్రపంచ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు భారత మాజీ క్రికెటర్ శ్రీ్ధరన్ శ్రీరామ్ సలహాదారుగా వ్యవహరించనున్నాడు. ఆసీస్ మాజీ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీతో కలిసి అతను సలహాదారుగా వ్యవహరిస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో వచ్చే ఏడాది మార్చిలో జరిగే టి-20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఎంపిక చేసిన ఆసీస్ జట్టుకు ఆరోన్ ఫించ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీకి ముందు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను ఆడనున్నట్టు సిఎ తెలిపింది. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌లో పర్యటించినప్పుడు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు శ్రీరామ్ కోచ్‌గా వ్యవహరించిన విషయాన్ని గుర్తుచేసింది. ఆ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే అతనిని సలహాదారుగా తీసుకున్నామని వివరించింది.