క్రీడాభూమి

ఫిఫా పాలక కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా ముద్గల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) పాలక కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా భారత విశ్రాంతి న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ ఎంపికైనట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై తనకు ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లభించలేదని ముద్గల్ తెలిపారు. క్రికెట్ రంగంలో ప్రకంపనలు సృష్టించిన ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుపై రెండు దశల్లో విచారణ జరిపిన ముద్గల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సుప్రీం కోర్టుకు నివేదికలను సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికల ఆధారంగానే రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలపై రెండు సంవత్సరాల వేటు పడింది. చెన్నై మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్, రాజస్తాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాలను జీవితకాలం సస్పెండ్ చేశారు. నివేదికను పరిశీలించి, దోషులకు శిక్షలను ఖరారు చేయడంతోపాటు, భారత క్రికెట్ ప్రక్షాళనకు అనుసరించాల్సిన విధివిధానాలను నిర్ణయించడానికి వీలుగా సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా మరో విశ్రాంతి న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలో సుప్రీం కోర్టు కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ చేసిన సూచనలపై ప్రస్తుతం కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. కాగా, భారత క్రికెట్‌లో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన ముద్గల్ కమిటీ నివేదిక ప్రపంచ క్రీడా రంగం దృష్టిని ఆకట్టుకుంది. ఇటీవలే ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఎఫ్‌సి) ముద్గల్‌కు పాలక కమిటీ డిప్యూటీ చైర్మన్ పదవిని ప్రతిపాదించింది. వచ్చేనెల ఎఎఫ్‌సి అధికారులతో ముద్గల్ సమావేశం కానున్నారు. ఇలావుంటే, తాజాగా ప్రపంచ సాకర్ సమాఖ్య ఫిఫానే ముద్గల్ ప్రతిభను గుర్తించి, పాలక కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా నియమించిందని తెలుస్తోంది. కానీ, తనకు ఫిఫా నుంచి సమాచారం అందలేదని ముద్గల్ అన్నారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లను పర్యవేక్షిస్తున్న ఆయన పిటిఐతో మాట్లాడుతూ ఫిఫా నుంచి సమాచారం అందిన తర్వాత స్పందిస్తానని అన్నారు. అయితే, ఏదైనా బాధ్యతను తీసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

శునక ప్రతాపం..
బెంగళూరు, మే 15: చూసేందుకు సరదాగా కనిపిస్తున్నప్పటికీ, పాపం.. ఆ అథ్లెట్ పరిస్థితిని తలచుకుంటే జాలి వేస్తుంది. బెంగళూరులో ఆదివారం జరిగిన టిసిఎస్ ప్రపంచ 10కె రన్‌లో పాల్గొన్న ఒక అథ్లెట్‌ను ఓ శునకం ఇలా తరిమింది. పోటీ మాట ఎలావున్నా, కుక్క కాటు నుంచి తప్పించుకోవడానికి ఆ అథ్లెట్ నానా తంటాలు పడ్డాడు. ఇలావుంటే, ఈ పోటీల్లో భారత్ తరఫున పురుషుల విభాగంలో లక్ష్మణన్, సురేష్ పటేల్, నితేందర్ సింగ్ రావత్ మొదటి మూడు స్థానాలు ఆక్రమించారు. మహిళల విభాగంలో స్వాతి గధావేకు స్వర్ణ పతకం లభించింది. ఫస్ట్ రన్నరప్‌గా సంజీవని జాదవ్, రెండో రన్నరప్‌గా మీను నిలిచారు. కాగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఈ రేసులో ఓవరాల్ టైటిల్‌ను పురుషుల విభాగంలో మోసినెట్ గెరెమీ (ఇథియోపియా), మహిళల విభాగంలో పెరెస్ జెచిర్చిర్ (కెన్యా) గెల్చుకున్నారు. మోసినెట్ 28 నిమిషాల 16 సెకన్లలో లక్ష్యాన్ని చేరగా, జాన్ లాంగట్ (కెన్యా), బొస్నా డిచ్ (ఇథియోపియా) వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు. అదే విధంగా మహిళల విభాగంలో పెరెస్ 32 నిమిషాల 15.13 సెకన్లలో గమ్యాన్ని చేరింది. ఈ రన్‌లో వరుసగా రెండో సంవత్సరం టైటిల్ అందుకున్న తొలి అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. హలా కిప్రోప్ (కెన్యా), వేడ్ ఇమర్ (ఇథియోపియా) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

రియో శిబిరంలో సుశీల్‌కు దక్కని చోటు

న్యూఢిల్లీ, మే 15: రియో ఒలింపిక్స్‌కు పురుషుల రెజ్లింగ్‌లో 74 కిలోల విభాగంలో దేశానికి ఎవరు ప్రాతినిథ్యం వహిస్తారన్న విషయంపై నెలకొన్న వివాదం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తున్నది. తనకే అవకాశం ఇవ్వాలని లేదా ట్రయల్ బౌట్‌ను నిర్వహించాలని ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పిన సుశీల్ కుమార్ డిమాండ్ చేస్తున్నాడు. అయితే, సుశీల్ చాలా అంతర్జాతీయ ఈవెంట్స్‌కు గైర్హాజరుకాగా, పోటీపడిన అన్ని ఈవెంట్స్‌లోనూ అద్భుత ప్రతిభ కనబరచిన నర్సింగ్ యాదవ్‌ను పంపాలన్న వాదన వినిపిస్తున్నది. నర్సింగ్‌తో ట్రయల్ బౌట్ కోసం డిమాండ్ చేస్తున్న సుశీల్ తన ప్రతిపాదను ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాడు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించాడు. సుశీల్ ఆందోళన కొనసాగుతుండగా, రియో ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యే రెజ్లర్ల కోసం నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో పాల్గొనే వారి జాబితాలో సుశీల్ పేరును భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) చేర్చలేదు.
74 కిలోల విభాగంలో రియోకు పంపే రెజ్లర్‌ను ఇంకా ఎంపిక చేయలేదని చెప్తున్న డబ్ల్యుఎఫ్‌ఐ సుశీల్ పేరును చేర్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నర్సింగ్‌నే రియోకు పంపుతుందా లేక పొరపాటు జరిగిందంటూ సుశీల్ పేరును చేరుస్తుందో చూడాలి.