క్రీడాభూమి

ఆ రహస్యం చెప్పను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 24: ఈ సీజన్ అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌కు చేరుకుంది. దీంతో మ్యాచ్ అనంతరం కామెంటేటర్ హర్షా బోగ్లే ధోనీతో మాట్లాడారు. ప్రతి సీజన్‌లో చెన్నై జట్టు ప్లే ఆఫ్‌కు చేరడంలో రహస్యమేంటని అడగ్గా, దీనికి ధోనీ సమాధానం చెప్పకుండా చమత్కరించాడు. ‘ఈ రహస్యాన్ని నా జట్టుతో మాత్రమే చర్చిస్తా, బయటకు చెబితే అందరూ అదే పాటించి మా జట్టును దెబ్బతీస్తారు. అంతేకాకుండా చెన్నై యాజమాన్యం నన్ను జట్టులోంచి తప్పిస్తుంది’ అని చమత్కరించాడు. తమ జట్టు విజయ రహస్యం ఏమీ లేదని, గెలవాలనే తపనతో జట్టు మొత్తం సమష్టిగా కష్టపడుతుందని చెప్పాడు. అభిమా నుల మద్దతు, యాజమాన్యం ప్రో త్సాహం, జట్టు సహాయక బృందం కూడా తమ గెలుపు కోసం శ్రమి స్తుందని ధోనీ చెప్పుకొచ్చాడు.