క్రీడాభూమి

ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ ఫైనల్లో కవీందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాంకాక్, ఏప్రిల్ 25: ఇక్కడ జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్ కవీందర్ సింగ్ బిస్త్ ఫైనల్ చేరాడు. పురుషుల 56 కిలోల విభాగంలో పోటీపడిన అతను సంచలన విజయాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ కైరత్ యెరాలియెవ్ (కజకస్థాన్)ను ఓడించి అందరినీ ఆకట్టుకున్న కవీందర్ సెమీ ఫైనల్‌లోనూ అదే దూకుడును కొనసాగించాడు. మంగోలియా బాక్సర్ ఎన్క్ అమార్ ఖకూపై ఆరంభం నుంచే విరుచుకుపడి, పాయింట్లు సంపాదించాడు. ఒక్కోసారి ప్రత్యర్థి నుంచి బలమైన పంచ్‌లు శరీరానికి తగులుతున్నప్పటికీ, ఏమాత్రం వెనుకంజ వేయని అతని చివరి వరకూ పోరాటాన్ని కొనసాగించాడు. అద్భుతమైన లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ పంచ్‌లతో ఖకూను దిగ్భ్రాంతికి గురి చేశాడు. చివరికి అతనిని ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టాడు. కవీందర్‌తోపాటు జాతీయ చాంపియన్ దీపక్ సింగ్ (49 కిలోల విభాగం), ఆశిష్ కుమార్ (75 కిలోల విభాగం) సైతం పురుషుల విభాగంలో తమతమ ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ చేరారు. కజకస్థాన్‌కు చెందిన టెమిర్టాస్ జుసుపోవ్‌తో దీపక్ సెమీస్‌లో తలపడాల్సి ఉండింది. అయితే, అనారోగ్య కారణంగా అతను ఫైట్‌కు హాజరుకాకపోవడంతో, ఒక్క పంచ్ కూడా విసరకుండానే దీపక్ ఫైనల్లో స్థానం సంపాదించాడు. 75 కిలోల విభాగంలో ఆశిష్ కుమార్, సయెద్‌షహిన్ ముసావీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఇరువురు బలమైన పంచ్‌లు, అద్భుతమైన అటాకింగ్స్‌తో రెచ్చిపోయారు. అయితే, చివరి వరకూ నీరసపడకుండా, పోరాటాన్ని కొనసాగించిన ఆశిష్ కుమార్ విజయం సాధించి, ఫైనల్ చేరాడు. మహిళల విభాగంలో పూజా రాణి (75 కిలోల విభాగం) సెమీ ఫైనల్స్ చేరింది. సరితా దేవి (60 కిలోల విభాగం), మనీష (54 కిలోల విభాగం) ఇప్పటికే తమతమ విభాగాల్లో సెమీస్ చేరి, కనీసం కాంస్యాన్ని ఖాయం చేసుకున్నారు.